ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. సంగీత ప్రపంచం నుంచి తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కుటుంబంతో గ‌డ‌ప‌డం కోస‌మూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇది త‌న అభిమానుల‌కు చేదు వార్తే అయినా త‌ప్ప‌డం లేద‌ని.. త‌ను చ‌నిపోయే వ‌ర‌కు అభిమానులు చూపిన ఆద‌ర‌ణ గుర్తుండిపోతుంద‌ని తెలిపింది. కాగా త్వ‌ర‌లో మినాజ్ త‌న బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోనున్న‌ట్లు స‌మాచారం. 
 ఇకపోతే నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే 2 కోట్ల మంది ఫాలోవర్లు ఒక్కసారిగా విస్తుపోయారు.


నా అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని తెలుసు. నా అభిమానులంతా నేను చనిపోయేవరకూ అభిమానిస్తూనే ఉంటారని కోరుకుంటున్నా’ అని చెప్పింది.
 నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్  జూ పెటీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తన ట్విట్టర్ ఖాతాలో సైతం పేరును మిసెస్ పెటీగా మార్చుకుంది. ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో 2009లో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఇక‌పోతే పెళ్లి చేసుకున్నంత మాత్రాన సంగీతానికి ఎందుకు దూర‌మ‌వుతుంది అన్న మాట‌లు కూడా కొంద‌రి నోట వెంట వ‌స్తున్నాయి. పెళ్లి అయినా త‌న ఆల్బ్‌మ్స్ చేస్తే బావుంటుంద‌ని మ‌రొకంద‌రి భావ‌న‌. ఆమె ఎంతో కాలం నుంచి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంతో ఈ విష‌యం అంత త్వ‌ర‌గా జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆమె ఫ్యాన్స్‌.  ఇప్ప‌టివ‌ర‌కు ఆమె ఆల్బ్ మ్స్‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ఇంత‌కు ఈ ప్రేమాయ‌ణం ఎప్ప‌టి నుంచి సాగుతుంది. పెళ్లి ఎప్పుడు త‌దిత‌ర విష‌యాలు తెలియాల్సి ఉంది. ఆమె పెళ్లి త‌ర్వాత అభిమానుల కోరిక మేర‌కు ఆల్బ్ మ్స్ చేస్త‌దా లేదా అన్న‌ది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: