బిగ్ బాస్ తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో ప్రస్తుతం సీజన్ 3  చాలా అట్టహాసంగా ప్రారంభమై ...క్షణ క్షణం ఆసక్తిగా సాగిపోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఐదుగురు హౌస్ మేట్స్ బయటకి వచ్చేసారు. అలాగే గతవారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ను రద్దు చేయడంతో హిమజ , మహేష్ , పునర్నవి లలో ఒకరు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు. కానీ , ఆ ముగ్గురిలో ఈ వారం మహేష్ ఒక్కడే నామినేషన్స్ లో ఉన్నాడు. హిమజ , పునర్నవి ఈ వీక్ నామినేషన్ లోకి రాలేదు. దీనితో మొత్తంగా ఈ వారం మహేష్ తో పాటుగా నామినేషన్స్ స్టార్ రాహుల్ , అలీ , రవి , శ్రీముఖి నామినేషన్స్ లో ఉన్నారు.

ఇక గతవారం హోస్ట్ నాగ్ స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరిని షాక్ కి గురిచేస్తుంది. బిగ్ బాస్ అందరికి డబుల్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు అయ్యింది. నాగ్ స్థానంలో వచ్చిన రమ్య ... నాగ్ రేంజ్ లో కాకపోయినా ఒకలెవెల్ లో అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ వారం మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి నాగ్ హోస్ట్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇకపోతే ఈ వీక్ బిగ్ బాస్  మరో డబుల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. 

ఇక అసలు విషయానికొస్తే ..... ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో అందరికంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్రీముఖి. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు ఇప్పటివరకు పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా టైటిల్ టార్గెట్ గా దూసుకుపోతుంది ..అలాగే శ్రీముఖి కి బయట ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే శ్రీముఖి ఇప్పుడే బయటకి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక అలీ  .... బిగ్ బాస్ సీజన్ 3 లో వరుసగా ఆరువారాలపాటు నామినేషన్స్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా అలాగే హౌస్లో కొనసాగుతూ వస్తున్నాడు. ఏడో వారం నామినేషన్స్ లోకి వచ్చాడు. కానీ , హౌస్లో టాస్క్ లలో స్ట్రాంగ్ ఎఫెక్ట్ పెట్టె వారిలో అలీ ముందువరుసలో ఉంటాడు కాబట్టి అలీ కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక రవి హౌస్లో చాలా సెన్సిటివ్ పర్సన్ గా చాలా మంచివాడిగా పేరుతెచ్చుకున్నారు.

అలాగే తన ప్రవర్తన కూడా అందరికి నచ్చడంతో రవి కూడా సేఫ్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. ఇక మిగిలింది మహేష్ , రాహుల్ . బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ స్టార్ గా మారిపోయాడు మన సింగర్ రాహుల్. వచ్చిన మొదటివారం నుండి నామినేషన్స్ లో ఉన్నప్పటికీ ఆ గండాన్ని తప్పించుకొని హౌస్లో కొనసాగుతూ వస్తున్నారు. కానీ , ఈ వారం మాత్రం రాహుల్ కి కొంచెం కష్టమే అని చెప్పాలి ...ఇక మహేష్ ..పరిస్థితి కూడా అలానే ఉంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో తన సత్తా చూపిస్తున్నప్పటికీ బాబా తో మాత్రమే బాగా కలిసిపోయాడు అనే ఒక వాదన అందరిలో బలంగా నాటుకుపోయింది. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చే డబుల్ సర్ప్రైజ్ లో భాగంగా మహేష్ ని , రాహుల్ ని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే గత వారం ఎలిమినేషన్ రద్దు చేసారు ..కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసి దాన్ని సరిపెట్టబోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: