Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 6:29 pm IST

Menu &Sections

Search

'సూర్య 39' ఈ రోజు నుండి మొదలెట్టాడు ! 

'సూర్య 39' ఈ రోజు నుండి మొదలెట్టాడు ! 
'సూర్య 39' ఈ రోజు నుండి మొదలెట్టాడు ! 
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమాకి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే.  సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమా  పూర్తి వివరాలను మరియు ఈ సినిమా సాంకేతిక విభాగాన్ని ఇటీవలే  అధికారికంగా ప్రకటించారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ ప్రారంభం కానుంది.  ఏమైనా  సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో  కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో  ప్రేక్షకులకు  డిఫరెంట్ చిత్రాలను అందిస్తూ.. ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే స్టార్ హీరోల్లో..   సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం' వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు.. 'గజినీ', 'సెవెన్త్ సెన్స్' వంటి ఓ కొత్తరకం సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలు  ఉన్నాయి. ఇక  గోపీచంద్ తో 'శౌర్యం' సినిమాతో  డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఆ తరువాత  తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి  బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు.  కాగా ఇప్పుడు సూర్య - డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.  


 ఇక ఈ సినిమా కూడా శివ గత సినిమాల శైలిలోనే పక్కా మాస్ అంశాలతో మంచి ఎమోషనల్ గా సాగుతుందట. ముఖ్యంగా సూర్య  క్యారెక్టర్ చాలా బాగుంటుందట.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సూర్య  మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. సినిమా ప్రోమోస్ కు వస్తోన్న స్పందన చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది.  ఇక సూర్య - శివ కలయికలో వచ్చే ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్  డి ఇమ్మాన్ ఈ  సినిమాకి మ్యూజిక్ ను సమకూర్చనున్నారు.  అలాగే  ఈ సినిమా కోసం కెమెరామెన్ గా  ప్రముఖ కెమెరామెన్  వెట్రీ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాను  జనవరిలో పొంగల్ సందర్భంగా  రిలీజ్  చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  


Suriya, Mass Director Siva Combination, is all set to prepare for the film. According to latest cinema sources, the regular shoot of the film will start from today.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.