ఇటీవల తెలుగు సినిమాల క్రేజ్ తో పాటు వాటి మార్కెట్ పరిధి కూడా రోజురోజుకు మెల్లగా విస్తరిస్తూ ముందుకు పోతోంది. ఇక ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు అత్యద్భుతమైన విజయాలు అందుకున్న తరువాత తెలుగు సినిమాలపై ఇతర రాష్ట్రాల, దేశాల ప్రేక్షకులు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక మార్కెట్ తో పాటు సినిమాల బడ్జెట్ లు పెరగడం, అలానే థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ వంటి వాటికి కూడా డిమాండ్ విపరీతంగా ఉంటోంది. ఇక శాటిలైట్ హక్కుల విషయంలో అయితే పలు ఛానల్స్ పోటీ పడి మరీ ధరలు చెల్లించి పలు సినిమాల హక్కులు దక్కించుకోవడం, ఇక అదే పెద్ద హీరోల సినిమాలు అయితే, మరింత ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నాయి. దాని వలన మంచి టిఆర్పి లతో పాటు, 

ఆ ఛానల్ పై వీక్షకాభిమానం కూడా పెరుగుతుందని భావించి, ఎంతైనా ఇచ్చి మరీ కొనడానికి ముందుకు వస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న రెండు బడా సినిమాల హక్కులను ఒకే తెలుగు ఛానల్ దక్కించుకోవడం నేడు పలు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాల శాటిలైట్ హక్కులను భారీ ధర చెల్లించి ఒక ప్రముఖ తెలుగు ఛానల్ దక్కించుకుంది. ముందుగా మహేష్ సినిమా హక్కులు కొనుగోలు చేసిన ఆ ఛానల్ వారు, ఇటీవల బన్నీ సినిమా హక్కులు కూడా కొని, ఏకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఆ రెండు సినిమాల పబ్లిసిటీని ఏకకాలంలో చేయనున్నట్లు సమాచారం. 

ఇక మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస సూపర్ డూపర్ హిట్స్ సాధించి ఉండడం, అలానే ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా లేకపోవడంతో సరిలేరు నీకెవ్వరు పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ కూడా మంచి విజయాలు అందుకొని ఉండడంతో, ప్రస్తుతం చేస్తున్న ఈ అల వైకుంఠపురములో సినిమా హ్యాట్రిక్ విజయాన్ని తప్పకుండా అందుకుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి, మరొక మూడు నెలల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కనుక సాధిస్తే, వీటి శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసిన సదరు ఛానల్ వారికి టిఆర్పి ల పంట పండినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: