ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా చెప్పుకునే టాలీవుడ్ పనితనం ఏంటో ఇప్పుడు దేశమంతా కాదు కాదు ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి సినిమా రెండు పార్టులు అప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సృష్టించని రికార్డులను క్రియేట్ చేసింది.


అయితే తెలుగు సినిమా స్టాండర్డ్స్ ను బాహుబలి తర్వాత సాహో.. సైరా సినిమాలు కొనసాగిస్తున్నాయి. ఈ లెక్క అటుంచితే తను తీసిన రెండు సినిమాలతో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈరోజు ట్విట్టర్ లో కొన్ని సినిమాల గురించి ప్రస్థావించి అవి హిట్టైతే తెలుగు సినిమా గమనం వేరేలా ఉండేదని అన్నారు.  


ఇంతకీ నాగ్ అశ్విన్ చెప్పిన ఆ సినిమాలు ఏవంటే ఖలేజా, లీడర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్. ఈ సినిమాలు హిట్టైతే కచ్చితంగా తెలుగు సినిమా రేంజ్ మరోలా ఉండేదని అన్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమాను కమర్షియల్ గా వర్క్ అవుట్ అవలేదు కాని ప్రేక్షకుల మనసుల్లో మాత్రం నిలిచిపోయాయి.   


ముఖ్యంగా ఖలేజా సినిమా హిట్ అయ్యుంటే త్రివిక్రం రైటింగ్ టాలెంట్ ఏంటన్నది తెలిసేదని అన్నారు నాగ్ అశ్విన్. చివరగా తన ఆల్ టైం ఫేవరేట్ మూవీ ఆపద్బాంధవుడు సినిమాని కూడా ఈ లిస్ట్ లో చేర్చాడు. తను చెప్పినట్టే పైన ఆయన ప్రస్థావించిన సినిమాలన్ని కొంతమంది ప్రేక్షకులకు నచ్చాయి. కాని బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ అందుకోలేదు. అవి కూడా హిట్ అయ్యుంటే బాగుండేది. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారింది మూస కథలకు మంగళం పాడేసి కొత్త కథలను ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట అలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: