టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇటీవల సక్సెస్ఫుల్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ తో పాటు ఇతర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 2న గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఆయా భాషల్లో బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు సమాచారం. 

ఇక ఇటీవల ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏఏ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమా హిందీ హక్కులను భారీ ధరకు  కొనుగోలు చేయడం జరిగింది. అయితే సరిగ్గా సైరా రిలీజ్ రోజునే హృతిక్ మరియు టైగర్ ష్రాఫ్ ల కలయికలో రానున్న వార్ సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో, దాని ప్రభావం సైరా పై పడే అవకాశం ఉందని నిర్మాతలు లోలోపల మధన పడుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక నేడు కొన్ని బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, సైరా సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా మంది నార్త్ ప్రేక్షకులు మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నారని, ముఖ్యంగా ఇది స్వాతంత్రోద్యమ నేపథ్యంతో రూపొందుతున్న సినిమా కావడం, అలానే ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ హిందీ వెర్షన్ కు వీక్షకులు మంచి ఆదరణ చూపించడం, 

అన్నిటికంటే ముఖ్యంగా అక్కడక్కడా ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రమోషనల్ ఫ్లెక్సీలు మరియు మల్టీప్లెక్సుల్లో ఉంచిన ఈ సినిమా అప్కమింగ్ రిలీజ్ హోర్డింగ్స్ ద్వారా ప్రజలు తమ సినిమాకు చాలావరకు ఆకర్షితులవుతున్నట్లు వారి వద్ద సమాచారం ఉందట. అదీకాక మెగాస్టార్ చిరంజీవి గతంలో కొన్ని హిందీ సినిమాలు చేసి ఉండడంతో, ఆ హోర్డింగ్స్ లో ఆయన్ను కొంతమంది వెంటనే గుర్తిస్తున్నారని అంటున్నారు. ఒకరకంగా దీనిని బట్టి నార్త్ లో సైరాకు ఇది కొంత శుభ సూచకం అని వారు భావిస్తున్నారట. అయితే ఈ సినిమా అధికారిక ట్రైలర్ రిలీజ్ తరువాత, సినిమాను ప్రేక్షకులకు చేరువయ్యేలా మరింతగా ప్రమోషన్ చేయగలిగితే, బాలీవుడ్ లో సైరా మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు..... !!


మరింత సమాచారం తెలుసుకోండి: