తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రోజురోజుకి మరింత ఆసక్తిగా ముందుకుసాగిపోతుంది. ఇప్పటికే ఈ షో 46 రోజులని పూర్తీ చేసుకుంది. అలాగే ఐదుగురు కంటెస్టెంట్స్ కూడా హౌస్లో నుండి బయటకి వెళ్లిపోయారు. ఇక ఈ వారం మహేష్ , రాహుల్ , అలీ , రవి , శ్రీముఖి నామినేషన్స్ లో ఉన్నారు. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా బాబా భాస్కర్ ఎన్నికైన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తి సాయంతో బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ గా తొలిరోజు బాబా భాస్కర్ హౌస్ మేట్స్ ని విపరీతంగా నవ్వించేసాడు. ముఖ్యంగా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. బిగ్ బాస్‌ను కూడా నేను పట్టించుకోనంటూ ..ఇప్పుడు కెప్టెన్ నేనే కనుక నేనే బిగ్ బాస్ అంటూ రెచ్చిపోయారు.  

ఇక కెప్టెన్ గా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన బాబా భాస్కర్ ... ఇంటి సభ్యులు తనపై కురిపించిన ప్రేమతోనే తాను కెప్టెన్‌ని అయ్యానని , టాస్క్‌లో తాను ఏమీ చేయకపోవడం సిగ్గుగా ఉందని చెప్పారు. అంత ఏజ్‌లో కూడా ఎంతో కష్టపడి తనను కెప్టెన్ చేసిన శిల్పాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అందరినీ నవ్వించారు. అలాగే  ఇంటిలో ఎవరూ తనను కెప్టెన్ అని పిలవకూడదని కండిషన్ పెట్టారు. వితికా, వరుణ్, పునర్నవి బాత్‌రూం క్లీన్ చేయాలని.. కిచెన్‌ను హిమజ, శివజ్యోతి, శిల్పా హ్యాండిల్ చేయాలని కెప్టెన్ ఆదేశించారు. రాహుల్, అలీలకు లివింగ్ రూం క్లీన్ చేసే బాధ్యతను బాబా భాస్కర్ అప్పగించారు.

ఈ వారం రోజులపాటు పొట్టి బట్టలు వేసుకోవద్దని అమ్మాయిలందరికీ కెప్టెన్  బాబా ఆర్డర్స్ వేసాడు. ఇక ఆ తరువాత  శ్రీముఖి తన పర్సనల్ అసిస్టెంట్‌గా ఉంటుందని చెప్పిన బాబా.. ఆమె స్విమ్మింగ్ పూల్, కోర్ట్ యార్డ్, డైనింగ్ ఏరియాను క్లీన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. శ్రీముఖిని తన పర్సనల్ అసిస్టెంట్‌గా పెట్టుకున్న బాబా భాస్కర్ ఆమెకు చుక్కలు చూపించారు. దగ్గరుండి కోర్ట్ యార్డ్‌లోని సోఫాల దుమ్మును దులిపించారు. సరిగా క్లీన్ చేయడం లేదు అంటూ దగ్గరుండి మరీ చేయించాడు. దీనితో కెప్టెన్ టార్చర్ పెడుతున్నాడని, ఆ మనిషి కెప్టెన్ అవడం తనకు ఇష్టం లేదని గట్టిగా ఏడ్చింది శ్రీముఖి. 

ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి  ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఆరు జోడీలుగా విడిపోవాలి. ప్రతి జోడీలోని ఇద్దరు సభ్యులు ఒకరితో ఒకరు ఎవరు ఎక్కువ ఫన్నీ అనే విషయంలో పోటీపడాలి. ఇందుకు సంబంధించిన ప్రశ్నలను బిగ్ బాస్  ఇచ్చారు. ఈ ప్రక్రియకు శ్రీముఖి సంచాలకులుగా వ్యహరించింది. ప్రతి ప్రశ్నకు కేవలం 5 సెకెన్లలో ఫన్నీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అని తెలిపాడు. ఎవరు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు అనే విషయాన్ని ఇంటిలోని సభ్యులే ఏకాభిప్రాయంతో నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో గెలిచిన వ్యక్తి బిగ్ బాస్ ఇచ్చిన టీషర్ట్ వేసుకుంటారు.

ఈ వ్యక్తితో ఇంటి సభ్యులంతా రోజంతా నవ్వుతూనే మాట్లాడాలి. ఈ టాస్క్‌లో శివజ్యోతి-రవి, హిమజ-మహేష్, శిల్పా-అలీ, రాహుల్-వితికా, వరుణ్-పునర్నవి, శ్రీముఖి-బాబా భాస్కర్ జంటలుగా వచ్చి ఆడారు. అయితే, మహేష్ ఫన్నీ ఆన్సర్లు ఇచ్చి అందరినీ మెప్పించాడు. దీనితో అందరూ ఏకాభిప్రాయం తో మహేష్ ని  విజేతగా ప్రకటించారు.ఆ తరువాత ఇంటి సభ్యులను బిగ్ బాస్ ఏడిపించేశారు. హౌస్‌లోకి వచ్చి తమ ఇంటి ఆప్యాయతలను కోల్పోతోన్న కంటెస్టెంట్లకు వారి ఇంటి వంటనే రుచి చూపించారు. కంటెస్టెంట్లకు తమ ఇళ్ల నుంచే ఫుడ్‌ను తెప్పించాడు. అలాగే, వాళ్ల ఇంటి సభ్యులు పంపిన మెసేజ్‌ను కూడా ఫుడ్ బాక్స్‌పై పెట్టి ఇచ్చారు. దీనితో అందరూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: