తమిళ రాజకీయాల్లో మరియు దక్షిణ సినిమా రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత జయలలిత. ముఖ్యంగా తమిళ రాజకీయాలలో వరుసగా రెండు సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమిళనాడు రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన జయలలిత రెండోసారి అధికారం చేపట్టాక అనుకోకుండా కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. దీంతో చాలామంది తమిళంలో ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ప్రస్తుతం భారతీయ చలన చిత్ర రంగంలో బయోపిక్లో పర్వం కొనసాగుతున్న తరుణంలో జయలలిత జీవితానికి సంబంధించి రెండు సినిమాలు వస్తున్న విషయం అందరికీ తెలిసినదే.


ఇప్పటికే బాలీవుడ్ సూపర్ లేడీ కంగనా రనౌత్ జయలలితకు సంబంధించిన ఒక బయోపిక్లో నటిస్తోంది. ఈ బయోపిక్ కోసం ఆమె సినిమాలు చేస్తూ ఆమె రాజకీయ రంగానికి సంబంధించిన ప్రధాన ఘట్టాలు గురించి తెలుసుకొని మరియు అదే విధంగా సినిమాలో జయలలిత లాగా క్లాసికల్ డాన్స్ చేయడం కోసం కంగనారనౌత్ ఇటీవల క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నట్లు అనేక వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా జయలలిత బయోపిక్ కి సంబంధించి మరొక సినిమా లో రమ్యకృష్ణ నటిస్తుంది. అయితే అది సినిమా కాదనుకోండి ఒక వెబ్ సిరీస్. అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమాలో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమాకి సంబంధించిన మొదటి లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే జయలలిత సినిమా కెరీర్ కి సంబందించిన కాంట్రవర్సీ విషయాలను ఈ వెబ్ సిరీస్ లో పెద్దగా టచ్ చేయాడం లేదట. ఎక్కువగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆమె పొలిటికల్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరగా పూర్తిచేసి ట్రైలర్ విడుదల చేయాలని డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు క్వీన్ అనే టైటిల్ పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: