సినీ నిర్మాతగా సక్సెస్ కావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. నిర్మాతకు సినీరంగంలో అన్ని విభాగాలపై పరిజ్ఞానం ఉండాలి  . అప్పుడే సక్సెస్ ఫుల్ నిర్మాత గా రాణించే అవకాశాలు ఉంటాయి . టాలీవుడ్ లో  కొంతమంది సినీ నిర్మాతలు సినిమాలు నిర్మించి,  చేతులు కాల్చుకుంటే మరికొంత మంది నిర్మాతలు మాత్రం లాభాల పంట పండిస్తున్నారు.  టాలీవుడ్ అగ్ర హీరోల కుటుంబాలకు చెందిన నిర్మాణ సంస్థలు సైతం లాభనష్టాలను చవిచూస్తున్నాయి .  తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలా చెప్పుకుని ఎన్టీఆర్,  ఏఎన్నార్ లకు సొంత  నిర్మాణ సంస్థలు ఉన్న విషయం తెలిసిందే.


 అలాగే సూపర్ స్టార్ కృష్ణ,  మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి  కూడా సినీ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కృష్ణ స్వయంగా సినిమా నిర్మాణాన్ని చేపడితే,  చిరంజీవి కుటుంబ సభ్యులు మాత్రమే నిర్మాణ సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారు .  మెగాస్టార్ బావమరిది అల్లు అరవింద్ గీతా  ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పలు విజయవంతమైన  చిత్రాలు నిర్మించగా, ఆయన సోదరుడు నాగబాబు కూడా అంజనా ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరిట పలు చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.  అల్లు అరవింద్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్  నిర్మాతల్లో ఒకరు కాగా,  నాగబాబు మాత్రం సినీ నిర్మాణంలో చేతులు కాల్చుకున్నారు.  నాగబాబు  నిర్మించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిని ఆయనకు నిరాశను ఆర్థిక నష్టాలు మిగిల్చాయి.


 చివరకు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాగబాబు  నిర్మించిన ఆరెంజ్ చిత్రం... అయితే ఆయన్ని ఆర్థికంగా కుదేలు చేసింది. నాగబాబు కు భిన్నంగా  రామ్ చరణ్ మాత్రం తాను నిర్మించిన ఒకే ఒక చిత్రం తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్  నిర్మాతగా అనిపించుకున్నారు . ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్  తన తదుపరి చిత్రం సైరా నిర్మిస్తున్న విషయం తెల్సిందే .  ఈ చిత్రం రామ్ చరణ్ ఎంతటి విజయాన్ని అందుకుంటారు చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: