మెగాస్టార్ హీరోలు సినిమాలు చేయడానికి మెగా ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో వరుసగా సినిమాలు తీస్తున్నారు.  మెగా ఫ్యామిలీ సినిమాలను అయన నిర్మిస్తూ వస్తున్నారు.  చిరంజీవి హీరోగా అయన ఎన్నో సినిమాలు నిర్మించారు. కాగా, ఇప్పుడిప్పుడే బయట హీరోల సినిమాలు తీస్తున్నారు గీతా ఆర్ట్స్ అధినేత.  ఇదిలా ఉంటె గీతా ఆర్ట్స్ తో పాటు నాగబాబు సొంతంగా అంజనా ఆర్ట్స్ బ్యానర్ తో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు.  


మెగాస్టార్ హీరోగా రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, స్టాలిన్, వంటి సినిమాలు తీశారు.  ఇందులో బావగారు బాగున్నారా, స్టాలిన్ మిన్నగా మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు.  రుద్రవీణ సినిమాకు మంచి పేరు వచ్చింది.  ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా తీశాడు.  అదీ ఫెయిల్ అయ్యింది.  దీంతో పాటు నటిస్తూ నిర్మించిన కౌరవుడు సినిమా కూడా ఫెయిల్ కావడం విశేషం.  


ఇదిలా ఉంటె, మెగా తనయుడు రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా ప్లాన్ చేసి తీశారు.  పాపం ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.  దీంతో అంజనా ప్రొడక్షన్స్ లో సినిమా తీయడం ఆపేశారు.  నాగబాబు ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాలు రావడం  ఆగిపోయాయి.  అనంతరం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించాడు.  ఈ ప్రొడక్షన్ హౌస్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. 


అది దారుణంగా ఫెయిల్ అయ్యింది.  ఆ తరువాత నిర్మాతగా నితిన్ తో చల్ మోహన రంగ సినిమా చేశారు.  ఆ సినిమా సైతం ఫెయిల్ అయ్యింది.  ఈ రెండు సినిమాల ఫెయిల్ తరువాత పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయలేదు.  అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ ను నిర్మించి మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించారు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  అనంతరం మెగాస్టార్ 151 వ సినిమా సైరాను  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు రామ్ చరణ్.  ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  భారీ అంచనాలతో  తెరకెక్కిన ఈ సినిమా  ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: