సరైన హిట్ పడితే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నట్టుగా ఇస్మార్ట్ శంకర్ హిట్ తో తన దమ్మేంటో చూపించాడు రామ్. ఓ వైపు ఆకలి మీద ఉన్న పులికి మంచి భోజనం దొరికినట్టుగా టెంపర్ తర్వాత సరైన హిట్టు లేక కెరియర్ సందిగ్ధంలో ఉన్న పూరికి రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ దొరికితే వచ్చే సినిమా ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ చూపించింది. 


దేవదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ కెరియర్ పరంగా ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న విధంగా సాగిస్తున్నా ఇస్మార్ట్ లాంటి మాస్ హిట్ మాత్రం ఇదవరకు రాలేదు. రామ్ కెరియర్ లో ఇస్మార్ట్ శంకర్ టాప్ 1 మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో రామ్ మళ్లీ ఇలాంటి మాస్ కథలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడట.     


ఇస్మార్ట్ సెట్స్ మీద ఉండగానే తనతో నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేసిన కిశోర్ తిరుమలతో ఓ సినిమా కన్ఫాం చేసిన రామ్ ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చి మాస్ డైరక్టర్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇంతకీ రామ్ తో తీసే ఆ మాస్ డైరక్టర్ ఎవరు అంటే వి.వి.వినాయక్ అని తెలుస్తుంది.   


మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రెస్ అంటే వినాయక్ అని చెప్పుకునే వాళ్లం. అయితే ఈమధ్య వినాయక్ తన రేంజ్ కు తగిన సినిమాలు చేయలేకపోతున్నాడు. ఇంటిలిజెంట్ ఫ్లాప్ తర్వాత వినాయక్ తో సినిమా అంటే సాహసమే అనేలా ఉన్నారు హీరోలు. అయితే రామ్ మాత్రం అందుకు భిన్నంగా వినాయక్ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఓ పక్క ఈమధ్యనే వచ్చిన విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ సాధించాడు కాబట్టి రాం కూడా మాస్ ఆడియెన్స్ నే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మరి రామ్ తీసుకున్న ఈ డెశిషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి ఉంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: