టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు హీరోలుగా రాణిస్తున్నారు.  ఒకప్పటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కుటుంబాల్లో మూడో తరం కూడా వచ్చేసింది.  టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలిగిపోయిన డి.రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ ‘కలియుగపాండవులు’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఆ తర్వాత యాక్షన్ తరహా సినిమాల్లో నటించారు.  ఆ తర్వాత ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ సినిమాల్లో నటిస్తూ వచ్చారు.  కొంత కాలంగా ఆయన మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. 

ఈ సంవత్సరం ‘ఎఫ్ 2 ’ సినిమాతో మంచి విజయం అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వెంకిమామ’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన మేనళ్లుడు అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నాడు.   వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఫన్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా నిజ జీవిత  మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.  ఈ మూవీ సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

వెంకిమామ మూవీని మొదట అక్టోబర్ 4 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ అక్టోబర్ 2 న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రిలీజ్ కాబోతుంది.   ఈ మూవీ దగ్గరలో రిలీజ్ అంటే చాలా కష్టమని భావించినట్లు సమాచారం. ఇప్పటికే ‘సైరా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి..ఇలాంటి సమయంలో ఆ సినిమాకు పోటీగా నిలవడం కన్నా ముందుగా ప్లాన్ చేస్తే బెటర్ అని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దీపావళి కానుకగా అక్టో బర్ 25 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది. ఈ మూవీలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. అయితే ఈ విషయం మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: