ఏ హీరో అయినా ఒక సినిమాని ఫైనల్ చేశాడంటే ఇక సెట్స్ మీదకు వెళ్ళడమే తరువాయి. ఒక్కసారి హీరో ఓకే అన్నాడంటే ఏ సినిమా పని అయినా స్పీడప్‌ అవుతుంది. డేట్స్ క్లాష్, బడ్జెట్ సమస్య ఉంటే తప్ప సినిమాకు బ్రేకులు పడే ఛాన్సే లేదు. ఇప్పుడు అలాగే 'ఆర్‌ ఎక్స్‌ 100' దర్శకుడు సంవత్సరం పాటు అందరి చుట్టూ తిరిగి ఆ తర్వాత రవితేజ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకున్నాడు. దాంతో కథ లాక్‌ చేసుకుని, కాస్టింగ్‌ ఫైనలైజ్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కానీ ఇంతలో రెమ్యునిరేషన్ విషయంలో పేచీ పెట్టిన రవితేజ వేరే సినిమాని పట్టాలెక్కించాడు.

దీంతో దర్శకుడు అజయ్‌ భూపతి మరో హీరోని వెతుక్కుని తన కథతో కన్విన్స్‌ చేయాల్సిన క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఫ్లాపుల్లో వున్న హీరో లాస్ట్‌ మినిట్‌లో ఈ సినిమా వదిలేసుకున్నాడంటే ఏ హీరో అయినా ఇక దానిని డౌట్‌ఫుల్‌గానే చూస్తాడు. ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది కూడా. కాబట్టే అజయ్ ఇప్పుడు ఇంకో హీరో దొరకడం కష్టమేనని చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాతో తెలుగు చిత్ర రంగంలోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు సిద్ధార్థ్‌. 

అందుకే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేయడానికి సిద్ధార్థ్‌ కూడా ఒప్పుకున్నాడు. ఇక హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ కూడా ఓకే చెప్పింది. వరుసగా ఫ్లాప్స్‌ వస్తోన్న టైమ్‌లో ఈ సినిమా మీద కాజల్‌ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అందరి ఆశలపై రవితేజ నీళ్లు చల్లేసాడు. ఎవరి ఎమోషన్స్ ని పట్టించుకోకుండా ఎంతో సింపుల్ గా వేరే సినిమాకి ఓకే చెప్పేసి కమిటయ్యాడు. రవితేజ 'డిస్కోరాజా' పూర్తి చేయడమే ఆలస్యం ఈ సినిమా స్టార్ట్‌ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి 'చీప్‌ స్టార్‌' అనే ఫీలింగ్‌ తెచ్చాడు. మరి నిజంగా రవితేజ ఇలా ఎందుకు చేశాడో అని చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ అజయ్ చెప్పిన కథ కంటే ఇప్పుడు కమిటయిన కథ అంత గొప్పదా అన్న అనుమానం కలుగుతోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: