ఇలియానా తెలుగు సినిమాల్లో నటించటం మానేసిన ఆరేళ్ల తర్వాత గతేడాది రవితేజ్ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. ఆ సినిమా ఇచ్చిన షాక్ తో మళ్లీ ఆమెకు అవకాశాలు దక్కలేదు. ఈమధ్య ఇల్లీ బేబీ తన బాయ్ ఫ్రెండ్ అండ్రూతో బ్రేకప్ అయిందని వార్తలొచ్చాయి. ఇప్పటి వరకూ ఈ న్యూస్ ఓ గాసిప్ గా ఉన్నా తన ఇన్ స్టా అకౌంట్ లో ఇల్లీ పోస్ట్ చేసిన ఓ కొటేషన్ ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తోంది.

 

“జీవితంలో ఒకానొక సందర్భంలో మనకు బాగా ఆప్తులనుకున్నవాళ్లు దూరమయ్యే సందర్భం వస్తుంది. ఈ సందర్భంలో మనల్ని మనమే ఓదార్చుకోవాలి, మనకు మనమే తోడుగా ఉండాలి. మన జీవితం నుండి ఎవరు వెళ్లిపోయినా మనల్ని మనం కోల్పోకూడదు” అంటూ రాసుకొచ్చింది. దీంతో వీరి బ్రేకప్ గురించి ఇలియానా నర్మగర్భంగా చెప్పకనే చెప్పినట్టైంది. ఇప్పుడు మళ్లీ తెలుగులో కెరీర్ కొనసాగించేందుకు సిద్ధమైందని వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ – కొరటాల కాంబోలో వస్తున్న 152వ మూవీలో ఇల్లీని హీరోయిన్ గా అనుకుంటున్నారని సమాచారం. అయితే.. ఇల్లీ బాడీ షేప్ మారిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి కూడా ఇల్లీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది.

 

 పాప్ సింగర్ డెమీ లొవాటో బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “మీరు మీలా ఉండాలి కానీ ఒకరి కోసం ఉండక్కరలేదు. మీ శరీరాన్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు” అంటూ ఆమె ఫోట్ పెట్టి.. డెమీ లావుగా ఉన్నా ఆమె స్టార్ స్టేటస్ ఏమీ తగ్గలేదు అని ఉదహరిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తను గతంలో చేసిన బికినీ ఫోటోషూట్ ఫోటోలను మళ్లీ అప్లోడ్ చేస్తూ నెట్ లో హల్ చల్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: