బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్- సల్మాన్ ఖాన్ జంటల పై అనేక వార్తలు రావటం జరిగాయి. వీరిద్దరూ ఇటీవల భరత్ అనే సినిమా లో కలిసి నటించడం జరిగింది. సినిమా విడుదల అయి పర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి. గతంలో కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటిలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం చేసిన తర్వాత రణబీర్ కపూర్ తో సహజీవనం చేయడం జరిగింది. అప్పట్లో వారిద్దరూ బ్రిడ్జి దగ్గర బికినీ...షార్ట్ లతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అయితే అనుకోకుండా 2017 వ సంవత్సరం లో రణబీర్ కపూర్ కి కత్రినా కైఫ్ ల మధ్య కొన్ని అనివార్య కారణాలవల్ల విభేదాలు వచ్చి విడిపోవడం జరిగింది. అయితే తాజాగా సింగపూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ గురించి షాకింగ్ కామెంట్ చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో నాకు ఉన్నది విడదీయరాని బంధం చాలా ప్రత్యేకమైన అనుబంధం అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిలో వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది ఆ సమయంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇండస్ట్రీకి నేను కొత్త అయినా కానీ నాకు కొండంత అండగా నా కెరియర్ కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చాలా సపోర్ట్ గా సల్మాన్ ఖాన్ ఉన్నారని కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది.


సల్మాన్ ఖాన్ మంచి మానవత్వం ఉన్న మనిషి..ఇతరుల కష్టాలను అర్థం చేసుకుంటారని ఎవరు కష్టాల్లో ఉన్న సహాయం చేసే మనస్తత్వం సల్మాన్ ఖాన్ కి ఉందని సల్మాన్ పై ఓ రేంజ్ లో కత్రినా కైఫ్ పొగడ్తల వర్షం కురిపించింది. అయితే చాలా కాలం తర్వాత కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ పై ఈ విధంగా కామెంట్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: