ఒక సెలబ్రిటీ లైఫ్ అంత ఈజీ కాదు. సెలబ్రిటీగా ఉంటూ ఎన్ని సౌలభ్యాలు మరియు సుఖాలు పొందవచ్చో అలాగే అదే పాపులారిటీ వారిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఎల్లవేళలా అటువైపు ప్రజలు ఇటు వైపు మీడియా ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. ఇప్పుడు అదే దెబ్బకు బలయ్యాడు మన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ భాయ్ అలియాస్ సల్లూ ఖాన్. కొద్ది నిమిషాల ముందు నుండి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్న ఒక వీడియో సల్మాన్ ఖాన్ కి ఉన్న ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసింది.


విషయం ఏమిటంటే సల్మాన్ ఖాన్ చెల్లెలు అయిన అర్పిత గణపతి ఉత్సవాన్ని నిర్వహించగా అందులో సల్మాన్ ఆడుతూ పాడుతూ అందరితో కలిసి చిందులు వేస్తూ చాలా జాలీగా కనిపించాడు. అసలు ఉత్సవానికే సైకిల్ మీద వస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన సల్మాన్ కొద్దిసేపట్లోనే విలన్ గా మారిపోయాడు. జనాల మధ్య డాన్స్ చేసి బాగా ఒత్తిడికి గురయ్యాడో ఏమో పక్కకు వెళ్లి అలా అగ్గి పెట్టి తీసి ఇలా సిగరెట్ వెలిగించాడు… మన పబ్లిక్ అలా వీడియో తీసి ఇలా యూట్యూబ్లో పెట్టేశారు. సల్మాన్ వినాయకుడికి సమీపంలోనే కొంచెం పక్కగా సినీ నిర్మాత అతుల్ అగ్నిహోత్రి తో కలిసి బహిరంగంగా సిగరెట్ తాగడాన్ని మనం ఆ వీడియోలో చూడవచ్చు.

కొద్దిసేపటి ముందే వచ్చి గణపతి ఉత్సవాల్లో పాల్గొన్న సల్మాన్ ని పొగిడిన ప్రజలంతా అలా బహిరంగంగా పొగ త్రాగడం చూసి వెంటనే తిట్టుకున్నారు. ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరిగి బ్రతుకు జీవుడా అంటూ బయటికి వచ్చిన ఈ బాలీవుడ్ బడా స్టార్ ఇప్పుడు మరొక వివాదంలో ఇరుక్కున్నాడు. ఫేస్ బుక్ మరియు ట్విట్టర్లో అయితే అందరూ విమర్శిస్తూ చాలా ట్వీట్లు మరియు పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా కానీ మన సెలబ్రిటీలు సోషల్ మీడియా కన్ను మరియు కెమెరాల ఉచ్చు నుంచి బయటపడడం అసాధ్యమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: