బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ..ఊహించని పరిణామాలు ..ఊహకందని  పై ఎత్తులతో చాలా ఆసక్తిగా సాగిపోతుంది. దాదాపుగా ఇప్పటికే షో సగం పూర్తి కావడంతో హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎవరూ కూడా గేమ్ నుండి మధ్యలో వెళ్లిపోవడానికి సిద్ధంగా లేకపోవడం తో వచ్చే రోజుల్లో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా సాగబోతోంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ ఇక్కడ ఏదైనా జరగొచ్చు... అవును బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సాధ్యమే. ఆరుని నూరు చేయగలడు ...నూరుని ఆరు చేయగలడు బిగ్ బాస్. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో మరో ముఖ్యమైన అంశం ఎలిమినేషన్. వారానికొకరు చొప్పున బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లాల్సిందే. ఇప్పటికే హౌస్ నుండి ఐదుగురు సభ్యులు బయటకి వెళ్లిపోయారు. వారిలో రోహిణి బిగ్ బాస్ కోపానికి బలైపోయిన విషయం తెలిసిందే. ఇకపోతే గతవారం ఎలిమినేషన్ ని రద్దు చేసి బిగ్ బాస్ అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్ విషయానికొస్తే ...ఈ వారంలో మహేష్ ,అలీ,రవి,శ్రీముఖి,రాహుల్ లు నామినేషన్స్ లో ఉన్నారు. 
ఈ వారం నామినేట్ అయిన ఐదుగురిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యి కాలుబయటపెట్టే ఆ కంటెస్టెంట్ ఎవరా అని ఎదురుచూస్తున్నారా ...ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు..అలీ రెజా.

అవును బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి మొదటి అరువరాలు అసలు నామినేషన్స్ లోకి రాని అలీ ...ఈ వారం అనుకోకుండా అనూహ్యపరిణామాల మధ్య నామినేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ...డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ నుండే బయటికి వచ్చేయబోతున్నాడు.అసలు ఈ వారం కూడా అలీ నామినేషన్స్ లోకి మాములుగా అయితే రాకూడదు. కానీ , హౌస్ మేట్స్ అందరూ అలీ ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి వెళ్ళలేదు కాబట్టి అలీని నామినేట్ చేస్తున్నాం అంటూ నామినేషన్స్ లోకి పంపించారు. చివరిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా కూడా అదే కారణంతో అలీని నామినేట్ చేసింది.

అలాగే అలీ కూడా ఏమంత సాఫ్ట్ కంటెస్టెంట్ కాదు. హౌస్లో చాలా కోపంగా ఉంటాడు. అలాగే ఇతర కంటెస్టెంట్ తో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడే మనసత్త్వం ఆలీది. కేవలం టాస్క్ ఆడుతున్నప్పుడు తప్ప ...మిగిలిన సమయంలో అలీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేడా అని అనిపించేలా చాలా సైలెంట్ గా ఉంటాడు. అదే ఇప్పుడు ఆలీకి శాపంగా మారింది. మొత్తంగా మొదటి ఆరు వారాలపాటు నామినేషన్ లోకి రాని అలీ , నామినేషన్ లోకి వచ్చిన మొదటివారమే నామినేషన్ అనే గండాన్ని దాటలేక ... ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ ని ముగించుకొని బయటకి వచ్చేసాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: