టాలీవుడ్ లోకి అష్టాచమ్మ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన నాని కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టాలు పడ్డాడు.  ఒక్క హిట్ వస్తే చాలు అనుకున్న సమయంలో మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నాని జాతకాన్నే మార్చేసింది.  అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్న నాని తర్వాత స్టార్ హీరోగా మారిపోయారు.  వరుసగా నాని నటించిన ఆరు సినిమాలు సక్సెస్ కావడం అతనికి తెలుగు సిని పరిశ్రమలో తిరుగులేకుండా అయ్యింది.  నాని తో మినిమం గ్యారెంటీ అనే పరిస్థితిలో నిర్మాతలకు డిసైడ్ అయ్యారు. 

ఈ సంవత్సరం జర్సీతో మంచి విజయం అందుకున్న నానీ ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీని నమ్ముకున్న ప్రతిసారి నాని విజయం సాధించాడు. మధ్యలో ఎమోషనల్ కంటెంట్ అంటూ జెర్సీ వంటి ప్రయత్నాలు చేసినా అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి కానీ డబ్బులు మాత్రం తేలేదు. నాని తాజా చిత్రంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంగ్ లీడర్' .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. 

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..'గ్యాంగ్ లీడర్' కథ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తి వినోదభరితంగా ఈ కథ కొనసాగుతుంది'అని అన్నాడు. ఆడవారు ఆది పరాశక్తులు అయితే ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారు. ఒక సాధారణ మహిళ తాను తల్చుకుంటే ఏదైనా సాధించవొచ్చు అనే అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక రివెంజ్ స్టోరీని హాస్యంతో దర్శకుడు నడిపించిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఈ గ్యాంగ్ లో అయిదుగురు ఆడవాళ్లు వుంటారు .. ప్రతినాయకుడి పాత్రలో కార్తికేయ కనిపిస్తాడు. అందరి పాత్రలకి ప్రాధాన్యత వుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది  అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: