కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఎంతో ఉత్కంఠత రేపిన చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ ప్రయోగం, చిట్ట చివరిలో దెబ్బకొట్టడంతో శాస్త్రవేత్తలు సహా ప్రజలందరూ ఎంతో దిగ్బ్రాంతికి లోనయ్యారు. 
చంద్రయాన్ 2లో అంతా సక్రమంగా జరుగుతోంది, ఇక జాబిల్లి పై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడమే మిగిలింది అనుకున్న సమయంలో, కేవలం చంద్రుడికి 2.1 కిమీ దూరంలో ఇస్రోకు, విక్రమ్ ల్యాండర్ కు కమ్యూనికేషన్ కట్ అయింది. దీనితో ఇస్రో శాస్త్రవేత్తలంతా తీవ ఆందోళన చెందిన దృశ్యాలు దేశ ప్రజలందరినీ కలచి వేశాయి. అయితే ఇస్రో కనీవినీ ఎరుగని గొప్ప ప్రయత్నం చేసిందని, 

విక్రమ్ ల్యాండర్ నుండి కమ్యూనికేషన్ కట్ అయినప్పటికీ ఇది ముమ్మాటికీ విజయమే అంటూ శాస్త్రవేత్తల అద్భుత కృషి పై ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు ఇస్రోకు అండగా నిలుస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రసంగించిన మోడీ, తన ప్రసంగం అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు, ఛైర్మన్ లను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో మోదీ ఆయనను దగ్గరకు తీసుకుని, గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్పారు. దీనిపై నిరూత్సాహపడాల్సిన అవసరం లేదని, ఏ ప్రయోగంలోనైనా ఎత్తు పల్లాలు సహజమని మోదీ ఇస్రో శాస్త్రవేత్తల వెన్నుతట్టారు.  

సోషల్ మీడియాలోనూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని చాలా మంది అభినందించారు. వారికి మద్దతుగా లక్షల సంఖ్యలో ట్వీట్లు వెల్లువెత్తాయి. ఇక ఈ అద్భుత ప్రయోగంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా తన మహర్షి సినిమా డైలాగ్ ను గుర్తు చేస్తూ, 'సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ, దీనితో ఇస్రో ఒక చారిత్రాత్మక ప్రయోగానికి ప్రయాణానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకం అని, మీవంటి గొప్ప శాస్త్రవేత్తలే నిజమైన హీరోలు, మీ వెంట మేమున్నాం, మన అందరి విజయానికి ఇదే నాంది, మీ అందరికి నా సెల్యూట్' అంటూ సూపర్ స్టార్ తన పోస్ట్ లో తెలిపారు కాగా మహేష్ బాబు పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: