బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ హౌస్ నుంచి ఎప్పుడు ఎవ‌రు ?  బ‌య‌ట‌కు వెళ‌తారో ?  తెలియ‌ని ప‌రిస్థితి. ఈ వారం హౌస్ నుంచి ఎవ్వరూ ఊహించ‌ని వ్య‌క్తి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కు ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు ఆలీ రెజా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఆదివారం వ‌చ్చిందంటేనే కంటెస్టెంట్ల‌కు ఎలిమినేష‌న్ భ‌యం వెంటాడుతూనే ఉంటుంది.


ఎలిమినేషన్‌లో ఉంటే.. కంటెస్టెంట్లకు రెండు విషయాలు తెలిసొస్తాయి. వారు ఎంత బలమైన కంటెస్టెంట్లన్న విషయం ఎలిమినేషన్‌ ప్రక్రియ చాటిచెబుతుంది. ఎలిమినేష‌న్‌కు నామినేట్ అవుతూ ఎలిమినేట్ కాకుండా వ‌స్తోన్న వారికి ఫాలోయింగ్ పెరుగుతున్న‌ట్టే లెక్క‌. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే వ‌రుస‌గా నామినేట్ అవుతూ వ‌స్తున్నాడు. ప్ర‌తిసారి ఎలిమినేట్ అవుతాడ‌నుకుంటున్న టైంలోనే సేఫ్ అవుతూ వ‌చ్చాడు.


నామినేషన్స్‌లోకి రాకుండా సేఫ్‌గేమ్‌ ఆడుతూ ఉంటే.. వారికి వాస్తవం బోధపడదు. బయట ఏం జరుగుతుందో ? త‌మ ఫాలోయింగ్ ఎలా ఉందో ?  కూడా తెలియ‌దు. ఒక్క‌సారి కూడా నామినేష‌న్ ఫేస్ చేయ‌క‌పోతే అత‌డికి ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్ప‌లేం. తాజా బిగ్‌బాస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ఎలిమినేష‌న్లు జ‌రిగాయి. హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూ ఇంటిని వీడిపోయారు. అయితే వీటన్నంటిలో ఏ ఒక్కసారి అలీరెజా నామినేషన్స్‌ను ఫేస్‌ చేయలేదు.


ఇదే కారణంతో.. అలీరెజాను స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా అందరూ పరిగణించి ఏడో వారంలో నామినేట్‌ చేశారు. సోష‌ల్ మీడియా ట్రెండింగ్ ప్ర‌కారం సేఫ్ గేమ్ ఆడుతూ వ‌చ్చిన ఆలీ ఎలిమినేట్ అయిన‌ట్టు ట్రెండ్ చెపుతోంది. మొదటి సీజన్లో.. కూడా ఇలాగే ప్రిన్స్‌ మొదటిసారి నామినేషన్‌ జోన్‌లోకి వచ్చి ఎలిమినేట్‌ అయ్యాడు.  రెండో సీజన్‌లో దాదాపు ప్రతీవారం నామినేట్‌ అవుతూ.. అంతకంతకూ తన ఫాలోయింగ్‌ పెంచుకుంటూ విన్నర్‌గా నిలిచాడు కౌశల్‌.


ఇక ఆలీ రెజా ఈ సారి ప్ర‌తి వారం సేఫ్ గేమ్ ఆడుతున్నా.. టాస్క్‌లు బాగా చేస్తున్నా త‌న‌కున్న టెంపర్‌, అగ్రెసివ్‌నెస్‌ మూలానే ఓట్లు తక్కువగా వచ్చాయని అందుకే ఎలిమినేట్‌ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు. ఆలీ ఎలిమినేట్ అయితే అంద‌రూ టాప్ కంటెస్టెంట్ అనుకున్న వ్య‌క్తికి ఇది బిగ్ షాకే అవుతుంది. మ‌రి నిజంగా ఏం జ‌రిగిందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: