'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇటీవల అనగా గత శుక్రవారం దేశవ్యాప్తంగా తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలలో విడుదల అయ్యి ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కొద్దో గొప్పో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే సినిమా భారీ స్థాయిలో విడుదల కావడంతో ఫస్ట్ మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం జరిగింది. దీంతో నిర్మాతలు సేఫ్ జోన్ లో పడ్డారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించింది.


మరియు అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవిలిన్ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి ప్రముఖ నటులంతా సినిమాల్లో నటించారు. మరియు అదే విధంగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో అందాల ఆరబోత హాట్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి కుర్రకారుని ఒక ఊపు ఊపింది. బ్యాడ్ బాయ్ అంటూ సినిమా లో వచ్చిన పాటలు జాక్వలిన్ ఫెర్నాండేజ్ చూపించిన అందాలు సినిమా థియేటర్ లో ఉన్న ప్రేక్షకులని మైమరిపించయి.


ఇటువంటి నేపథ్యంలో ఈ స్పెషల్ సాంగ్ కోసం మొట్టమొదటిసారిగా యువి క్రియేషన్స్ సంస్థ కు చెందిన నిర్మాతలు ప్రభాస్ స్నేహితులు కాజల్ అగర్వాల్ సంప్రదించారట. అయితే కాజల్ ఒప్పుకోకపోవడంతో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కి అవకాశం దక్కినట్లు సమాచారం. అయితే సినిమా విడుదల అయ్యాక  తనని కాదని జాక్వెలిన్ ని ఎంచుకోవడంతో ప్రభాస్ పై కాజల్ మనస్తాపానికి గురైనట్లు వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. మరోపక్క వచ్చిన వార్తలలో వాస్తవం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు...కేవలం జాక్వెలిన్ కు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉండడం తోనే జాక్వలిన్ ఫెర్నాండేజ్ నీ ఎంచుకున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: