రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సుజీత్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సాహో. బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాల సూపర్ హిట్స్ తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడం, అలానే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడంతో, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ విపిరీతంగా పెరగడంతో పాటు ఆయన మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా, ఇతర భాషలు మరియు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడం జరిగింది. అలానే తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తుండడం కూడా ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడడానికి మరొక కారణం. రన్ రాజా రన్ అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న సుజీత్, 

తప్పకుండా ఈ సినిమాను మంచి విజయవంతంగా తీర్చిదిద్దుతాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులందరూ భావించారు. అయితే తీరా రిలీజ్ రోజున థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన ప్రేక్షకుడికి అసలు ఏ మాత్రం ఆకట్టుకొని విధంగా ఈ సినిమా తెరక్కిన విధానాన్ని చూసి చాలామంది నిరుత్సాహపడ్డారు. అసలు ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో అర్ధం కాలేదని, అలానే సినిమాలో విజువల్స్ కోసమే డబ్బు మొత్తం ఖర్చు చేసిన యూనిట్, పూర్తి స్థాయిలో కథ మరియు కథనాలపై శ్రద్ధ పెట్టలేదని ప్రేక్షకుల నుండి విపరీతమైన విమర్శలు వెలువడ్డాయి. ఇక మొన్న వరుసగా మూడు రోజులు సెలవలు రావడంతో బాగానే కలెక్షన్స్ సంపాదించిన ఈ సినిమా, ఇక ఆ తరువాత రోజు నుండి చాలా చోట్ల పూర్తిగా చతికలబడింది. ఇక నైజాం, ఓవర్సీస్ తదితర కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు చాలావరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఓవర్సీస్ లో కొనుగోలు చేసిన సంస్థకు సాహో నిర్మాతలు కొంత నష్టాన్ని భర్తీ చేస్తున్నట్లు మాటివ్వడం జరిగిందట. 

నిజానికి ఓవర్సీస్ లో ఈ సినిమా రూ.42 కోట్ల బిజినెస్ చేసిందని, అయితే అందులో ఇప్పటివరకు రూ.27 కోట్ల వసూళ్లు సాహో రాబట్టడం జరిగింది. అయితే ఎలా చూసుకున్నా, మొత్తంగా క్లోజింగ్ సమయానికి ఈ సినిమా మహా అయితే రూ. 30 నుండి రూ.32 కోట్లవరకు మాత్రమే రాబట్టే అవకాశం ఉందని, కావున అక్కడి బయ్యర్లు నష్టపోయే మిగిలిన మొత్తాన్ని సాహో నిర్మాతలు తిరిగి ఇవ్వనున్నారట. అలానే త్వరలో మిగతా ప్రాంతాల్లో నష్ఠాలను కూడా అంచనా వేసి ఆయా ప్రాంతాల బయ్యర్లకు చెల్లించనున్నారని అంటున్నారు. అయితే నిజానికి నిన్నటినుండి విపరీతంగా ఈ వార్త ప్రచారం అవుతున్నప్పటికీ, దీని పై ఇప్పటివరకు సాహో సినిమా నిర్మాతల నుండి కానీ, బయ్యర్ల నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ వార్త పై నిజానిజాలు వెల్లడయ్యేవరకు దీనిని విశ్వసించలేమని, అయితే ఇది కనుక నిజమే అయితే ఆ సినిమా నిర్మాతలకు సర్వదా ప్రశంశలు దక్కడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!     


మరింత సమాచారం తెలుసుకోండి: