మెగస్టార్ చిరంజీవి జీవితంలో చేయని పాత్ర ఇది. ఆయన 150 సినిమాలు చేసారు. కానీ ఎపుడూ వేయని కాస్ట్యూంస్ ఇవి. ఆయన ఎన్నో ఆయుధాలు చేతపట్టి విలన్లను చిత్తు చేశారు. కానీ ఆయన కత్తి ఎపుడూ పట్టలేదు. అలాంటి ముచ్చట్లు ఎన్నో తీర్చబోయే చిత్రం సైరా నరసింహారెడ్డి. నిజంగా నాలుగు పదులకు పైగా సుదీర్ఘమైన సినీ జీవితం కలిగిన  చిరంజీవి ఇంతవరకూ చారిత్రాత్మకమైన పాత్రలు వేయలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. చిరంజీవికి ఆ టాలెంట్ ఉంది.


ఆయన ప్రతిభా పాటవాలను సరిగ్గా వాడుకోలేని ఇండస్ట్రీది ఆ తప్పు అనాలి. ఆయన కమర్షియల్ మూవీస్ సూపర్ హిట్లు, నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని అంతా అక్కడే ఫిక్స్ అయిపోయారు. దాంతో చిరంజీవి అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అని ముద్ర పడిపోయింది. అపుడపుడు చిరంజీవి ఓ శుభ లేఖ, స్వయంక్రుషి ఆపద్భాంధవుడు, రుద్ర వీణ లాంటి సినిమాలు చేసినా కూడా చిరంజీవిని ఎక్కువగా మాస్ మసాలాకే వాడుకున్నారు.


ఇన్నేళ్ళకు చిరంజీవి లాంటి నటుడు చేయాల్సిన పాత్ర చేస్తున్నాడని అంతా అంటున్నారు. ఆ పాత్రలో ఆయన ఎలా చేస్తాడన్న డౌట్లు ఎవరికీ లేవు. ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. ఏ పాత్రని అయినా పండించే సామర్ధ్యం ఆయనకే సొంతం కాబట్టి. ఇక చిరంజీవి డిఫరెంట్ జోనర్లో మూవీ నటించడమే సైరా స్పెషల్ గా చెప్పుకోవాలి.


ఇదిలా ఉండగా  సైరా మూవీ అన్ని రకాల లాంచనాలను పూర్తి చేసుకుని విడుదలకు సిధ్ధంగా ఉంది. నెల రోజులు కూడా రిలీజ్ కి టైం లేదు. దాంతో రాం చరణ్, చిరంజీవి కలసి ప్రమోషన్ కి భారీ ప్లాన్ వేస్తున్నారు. ఇక సినిమాని దర్శక దిగ్గజం రాజమౌళికి చూపిస్తున్నారుట. ఆయన తనదైన అభిప్రాయం చెబుతారని సైరా యూనిట్ అభిప్రాయపడుతోంది.  అంటే ఓ విధంగా సైరా మూవీ చూసే మొదటి ఆడియన్ రాజమౌళి అనుకోవాలి. ఇక అక్టోబర్ 2న సైరా మూవీ గ్రాండ్ రిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది. అభిమానులే కాదు, మంచి సినిమా కోరుకునే వారంతా బీ రెడీ అంటోంది సైరా యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: