అక్కినేని నాగచైతన్య హీరోగా కెరీర్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ పదేళ్ళ ప్రయాణం గురించి, మిగతా విషయాల గురించి చైతన్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సమంత గురించి నాగచైతన్య షాకింగ్ విషయాలు చెప్పాడు. సమంతతో చైతన్య ప్రేమ కథలో పాజిటివ్, నెగటివ్స్ రెండూ ఉన్నాయని, అందరిలా చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అపార్థాలు ఇద్దరి ప్రేమకథలో ఉన్నాయని చెప్పాడు. 
 
గొడవలు జరిగినప్పుడు సమంత వెంటనే వచ్చి మాట్లాడుతుంది. నేను మాట్లాడటానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటానని చైతన్య చెప్పాడు. సమంతతో కలిసి నటించాలని ఉందని విభిన్నమైన కథ దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పాడు. సమంతకు పెళ్ళైన తరువాత సినిమా అవకాశాలు తగ్గటం గురించి మాట్లాడుతూ సమంత సినిమాల క్వాంటిటీ తగ్గినా క్వాలిటీ పెరిగింది. తక్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలని సమంత అనుకొంటుందని ఎక్కువ సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకోవటం లేదని చైతన్య చెప్పాడు. 
 
పిల్లలంటే బాగా ఇష్టం అని, పిల్లలంటే ప్యూరిటీ అని, అమ్మానాన్న సరదాగా మనవళ్ళు కావాలని డైలాగులు వేస్తుంటారని, అడిగినప్పుడల్లా నవ్వేసి ఊరుకుంటానని చైతన్య చెప్పాడు. ఏ మాయ చేసావె షూటింగ్ సమయంలో నేను సమంత హీరో, హీరోయిన్ అన్నట్లు చేశాం. మా జర్నీ ఇక్కడివరకూ వస్తుందని అస్సలు ఊహించలేదని అన్నాడు. 
 
వెంకటేశ్ తో పుల్ లెంగ్త్ రోల్ లో నటించటం గురించి చెబుతూ వెంకీ మామతో కలిసి చేయడం నాకు పెద్ద ఛాలెంజ్. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. వెంకీ మామతో యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తూనే చాలా నేర్చుకుంటున్నాను. వెంకీ మామ సినిమా వెంకీగారి అభిమానులకు, నా అభిమానులకు పండగలా ఉంటుంది. నాన్న నాగార్జునతో కలిసి త్వరలో బంగార్రాజు సినిమాలో నటించబోతున్నానని నాగచైతన్య చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: