‘సాహో’ ఫలితం తేలిపోవడంతో మరో 24 రోజులలో విడుదల కాబోతున్న ‘సైరా’ మూవీ గురించి అది సాధించబోయే రికార్డుల గురించి ఇప్పుడు అంచనాలు మొదలయ్యాయి. ‘సైరా’ కలక్షన్ రికార్డుల గురించి అప్పుడే కొన్ని ప్రాంతాలలో పందాలు కూడ ప్రారంభం అయిపోయాయి.

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ భారీ సినిమా విడుదలైనా ఆ మూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటూ ఊహాగానాలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. రజినీకాంత్ ‘2.0’ ప్రభాస్ ‘సాహో’ ఇలా ఈ రెండు సినిమాలు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేస్తాయి అంటూ అంచనాలతో విడుదలై చివరకు అంచనాలను అందుకోలేక దిగాలు పడ్డాయి. 

రాజమౌళి ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఒక్క ప్రభాస్ ‘సాహో’ వల్లే అంటూ ఇప్పటివరకు ప్రచారం చేసుకుని భంగపడ్డ ప్రభాస్ అభిమానుల అవమానం గుర్తించకుండా మెగా అభిమానులు ‘బహుబలి 2’ రికార్డులను ‘సైరా’ బ్రేక్ చేస్తుంది అంటూ అత్యుత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విపరీతమైన అంచనాలు ‘సైరా’ కు కూడ కీడు చేస్తాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

ప్రతి భారీ సినిమా స్థాయిని ‘బాహుబలి’ తో పోల్చడం అదేవిధంగా ఆ మూవీ కలక్షన్స్ రికార్డులతో పోలుస్తూ మిగతా భారీ సినిమాల కలక్షన్స్ పై కామెంట్స్ చేయడం ఏమంత శ్రేయస్కరం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘బాహుబలి 2’ సృష్టించిన కలక్షన్స్ రికార్డులు అన్ని సినిమాలకు రావు ఒక దశాబ్దానికి ఒక్క సినిమా మాత్రమే అలాంటి స్థాయి విజయాన్ని అందుకుంటాయి. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా ప్రస్తుతం మెగా అభిమానులు ‘సైరా’ పై చేస్తున్న విపరీతమైన ప్రచారం పరోక్షంగా ఈ సినిమాకు సమస్యగా మారి ‘సాహో’ కు వచ్చిన ఫలితం ఎదురైనా ఆశ్చర్యం లేదు అంటూ కొందరి కామెంట్స్..   


మరింత సమాచారం తెలుసుకోండి: