కామెడీ దర్శకులు అనీల్ రావిపూడి దర్శకత్వంలో  మాస్ మహరాజ రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రెండు సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా లో పూర్తిగా అంధుడిగా నటించిన రవితేజ్ మాస్ రేంజ్ ఓ స్థాయికి పెంచాడు.  ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఇక టాలీవుడ్ లో రవితేజకు తిరుగు లేదని అనుకున్నారు.  కానీ సీన్ రివర్స్ అయ్యింది.. రవితేజ నటించిన నేల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 

దాంతో రవితేజ కెరీర్ ఒక్కసారే డేంజర్ లో పడిపోయింది.  దాంతో తన తదుపరి సినిమాపై బాగా ఫోకస్ చేస్తున్నాడు రవితేజ.   ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన పవర్ సినిమా తర్వాత రవితేజకు అప్పట్లో ఒక్క హిట్ కూడా లేదు. 2000-2011 వరకి అతనికి సంవత్సరానికి ఒక నిజమైన హిట్ మూవీ వుంది అంటే అతిశయోక్తి కాదు. 2012 నుండి 2018 వరకి రవితేజ మాత్రం సినిమాలు చేస్కుంటూ వెల్లిపోతున్నాడు. రెండు సంవత్సరాల సిని పరిశ్రమకు దూరంగా ఉన్నాడు..ఇక ‘రాజా ది గ్రేట్’ సినిమా తప్ప మిగిలినవి ఏమి అంతగా ఆశీంచినంత విజయం మన మాస్ రాజా కి ఎదురవ్వలేదు.

ఈ నేపథ్యంలో మాస్ రాజ్ ఫాన్స్ కూడా ఒక హిట్ అని సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతూ మన మాస్ రాజా ని వేడుకుంటున్నారు.2019 జనవరి లో మొదలు పెట్టిన తన 66 వ సినిమా “డిస్కో రాజా” ఫస్ట్ లుక్ పోస్టర్ గత 2 రోజుల నుండి సోషల్ మీడియా లో చాలా బాగా పాపులర్ అవుతుంది. కాగా ఈ సినిమా ఈ ఏడాది చివరి నెల అనగా  డిసెంబర్.20వ తేదీన రిలీస్ కి రెఢీ అవుతుంది.

ఈ మూవీ లో రవితేజ పాత్ర ప్రయోగాత్మకంగా ఉండబోతుందట.  అంతే కాదు మూడు రకాల పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ సినిమా కి దర్శకుడుగా ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’ మరియు “ఒక్క క్షణం” లాంటి వైవిధ్యమైన దర్శకుడిగా పేరు పొందిన  విఐ ఆనంద్  దర్శకత్వ బాధ్యత చేపట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: