బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హిందీ సినిమాలు చేయడం తగ్గించేసింది. వివాహం చేసుకున్నాక కమిటైన సినిమాలను పూర్తి చేసింది.  వివాహం చేసుకోబోతున్న కారణంగా సల్మాన్ ఖాన్ సినిమా భారత్ ను పక్కన పెట్టింది.  సల్మాన్ ఖాన్ సినిమా పక్కన పెట్టడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.  కావాలనే సల్మాన్ ఖాన్ సినిమాను పక్కన పెట్టిందని వార్తలు వచ్చాయి.  అవేమి కాదని, కావాలని ఆమె సినిమాను పక్కన పెట్టలేదని, వివాహం కోసమే సినిమా పక్కన పెట్టిందని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  


హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్నాక, హాలీవుడ్ లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.  అక్కడ సినిమాలు చేస్తున్నది.  మరోవైపు బాలీవుడ్ లో స్కై ఈజ్ పింక్ అనే సినిమా చేసింది.  ఇందులో 18 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటిస్తోంది.  ఈ సినిమా చాలా స్ఫూర్తిదాయకమైన చిత్రం.  అందుకే ప్రియాంక ఇందులో నటించింది.  ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం తదితరులు నటించారు.  


చిన్నతనంలోనే అరుదైన వ్యాధికి గురయ్యి, 15 ఏళ్లకే కవయిత్రిగా, రచయితగా పేరు తెచ్చుకున్న అయేషా చౌదరి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.  18 ఏళ్ల వయసులో అయేషా లిటిల్ ఎపిఫనీస్ పుస్తకం రాసింది.  విచిత్రం ఏమిటంటే.. ఆమె పుస్తకం రిలీజైన మరుసటి రోజే అరుదైన వ్యాధితో మరణించింది.  నిజంగా అది హృదయవిదారక సందర్భం అని చెప్పాలి.  


పుస్తకం రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో మరణించడం అంటే.. విషాదమనే చెప్పాలి.  ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఇందులో తెలియని విషాదం నిండి ఉంటుంది. ఇక ప్రియాంక తల్లి పాత్రలో ఎలా నటించిందో తలచుకుంటేనే ఔరా అనిపిస్తుంది.  అద్భుతంగా నటించిందా లేదంటే ఎలా నటించింది అన్నది తెలియాల్సిన అంశం.  ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కంటతడి పెట్టించడం ఖాయం అని మాత్రం స్పష్టం అవుతున్నది.   ఈ సినిమా టోరెంటో ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది.  ఈనెల 13 వ తేదీన టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: