నేచురల్ స్టార్ నాని నటించిన "గ్యాంగ్ లీడర్" చిత్రం ఈ నెల ౧౩ వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. విడుదల అయిన లిరికల్ సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో నాని మీడియాతో మాట్లాడారు.


సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. నాని గత సినిమా అయిన "జెర్సీ" గురించి ఆయన మాట్లాడారు.గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కి శ్రధ్దా శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటించిన జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్కాయి కాని సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే నమోదు కాలేదు అని అందరు అనుకున్నారు.


కానీ అలాంటిదేమీ లేదని, ఈ సినిమాకి ముప్ఫై కోట్ల వరకు వసూళ్ళు సాధించిందని,నా అభిప్రాయం ప్రకారం సినిమా సక్సెస్‌ అయ్యింది.విమర్శకుల నుండి ప్రశంసలు దక్కడం, మంచి రివ్యూలు రావడం అలాగే 30 కోట్ల వరకు కలెక్షన్స్‌ రావడం జరిగింది. అంతే కాకుండా ఈ చిత్రంను పలు భాషల్లో రీమేక్‌ చేసేందుకు కూడా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ ముందుకు వస్తున్నారు. ఇంతటి మంచి స్పందన వచ్చిన సినిమాను గురించి పదే పదే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు.


వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని "గ్యాంగ్ లీడర్" చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ టైటిల్ వాడుకున్నందుకు చిరంజీవి అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయినా ధైర్యంతో ఆ టైటిల్ పెట్టారంటే దర్శకుడు ఈ సినిమాని ఎంత నమ్ముతున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి వారు అనుకున్న విజయం సాధిస్తుందా లేదా తెలియాలంటే 13 వ తేదీ వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: