సాహో సినిమా రిలీజ్ అయ్యి 8 రోజులైంది.  సినిమాకు మొదటి షో నుంచి డివైస్ టాక్ రావడంతో పెద్దగా కలెక్షన్లు రావని అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా అంచనాలకు మించి కలెక్షన్లు వసూలు చేసింది.  సినిమాకు డివైడ్ టాక్ వస్తే.. ఆ సినిమాకు కలెక్షన్లు భారీ స్థాయిలో పడిపోతాయి.  కానీ, సాహో విషయంలో అందుకు విరుద్ధంగా జరగడం విశేషం.  


ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 370 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.  లాంగ్ రన్ లో మరో ముప్పై నుంచి నలభై కోట్లు సాధించవచ్చు.  బాలీవుడ్ లో ఈ సినిమా రూ. 128 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.  డివైడ్ టాక్ లో ఈ స్థాయిలో వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. సత్తా ఉండాలి.  బాహుబలి ఇచ్చిన బూస్ట్ తో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది.  


మొదటి రోజు నుంచి కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి.  బాలీవుడ్ ప్రేక్షకులు డివైడ్ టాక్ ను పెద్దగా పట్టించుకోలేదు.  డివైడ్ టాక్ ను పక్కన పెట్టి ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది అంటే ప్రభాస్ కు మార్కెట్ ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.  ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సాహూ బాలీవుడ్ లో ఐదో స్థానంలో నిలిచింది.  ఫస్ట్ ప్లేస్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన కబీర్ సింగ్ ఉండటం విశేషం.  


ఇదిలా ఉంటె ఓవర్సీస్ లో ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్ దాదాపు ముప్పై కోట్లు వసూలు చేయడం విశేషం.  సినిమా ఏ మాత్రం బాగుంది అనే టాక్ వచ్చినా ఈపాటికి కలెక్షన్లు దుమ్ము రేపుతుండేవి.  అయినా ఇప్పటికి కూడా సినిమాకు కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి.  మొత్తానికి అనుకున్నంతగా కాకపోయినా ప్రభాస్ కలెక్షన్ల విషయంలో పర్వాలేదనిపించారు.  మరో లాంగ్ రన్ లో బాలీవుడ్ లో ఎంతమేర కలెక్షన్లు వస్తాయో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: