మ్యాచో హీరో గోపిచంద్ నటిస్తున్న తాజా చిత్రం 'చాణక్య' షూటింగ్ ను పూర్తి చేసుకొని  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను  జరుపుకుంటుంది.  ఈ చిత్రం గోపిచంద్ కెరీర్ లోనే  అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.  ప్రముఖ నిర్మాతలుఅనిల్ సుంకర , అభిషేక్ అగర్వాల్  ఈసినిమా కోసం సుమారు 30కోట్ల వరకు  ఖర్చుపెడుతున్నారు.  అయితే ఇటీవల గోపిచంద్ నటించిన సినిమాలు  బాక్సాఫీస్  వద్ద  బోల్తా పడడంతో  ప్రస్తుతం అతని మార్కెట్ పడిపోయింది.  ఈనేపథ్యంలో చాణక్య 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అసాధ్యం గా కనిపిస్తుంది. 



ఇప్పటికే ఈ సినిమా  ఆంధ్ర హక్కులను  5కోట్లకుఅమ్మారు. నైజాం మరియు రెస్ట్ అఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో మరో 15కోట్ల బిజినెస్  చేసినా 20కోట్ల తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో మరో 10కోట్ల వరకు లాస్ వస్తుంది. అయితే ఈ లాస్ ను  నాన్ థియేట్రికల్ రూపంలో  కవర్ చేయనున్నారు నిర్మాతలు.  అందులో భాగంగా శాటిలైట్ , డిజిటల్ హక్కుల రూపంలో మరో 10 కోట్ల వరకు  రానున్నాయి. అలా నిర్మాతలు సేఫ్ కానున్నారు.  కానీ  టేబుల్ ప్రాఫిట్ తో విడుదలైతేనే  నిర్మాతలకు లాభాలు వస్తాయి. దాంతో  మీడియం రేంజ్ హీరో కు  భారీ బడ్జెట్ పెట్టి చేస్తున్నారు  రిస్క్ చేస్తున్నారు నిర్మాతలు.  మరి ఈ సినిమాతో హిట్టు కొట్టి గోపిచంద్ 30కోట్ల క్లబ్ లో చేరాలని కోరుకుందాం.  



ఇక ఈ చిత్రం యొక్క  టీజర్ రేపు సాయంత్రం 4:05 గంటలకు  విడుదలకానుంది. తమిళ డైరెక్టర్  తిరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ , జరీన్ ఖాన్ కథానాయికలు  నటిస్తున్నారు. అక్టోబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: