యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన సినిమా 'సాహో'. భారీ అంచనాల మధ్య దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా పడిన మొట్ట మొదటి షోకే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా క్రేజ్ బట్టి పండగ సీజన్ నేపథ్యంలో లాస్ట్ వీకెండ్ విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో అన్ని భాషల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర హడావిడి సృష్టించింది. మొదటిసారి వీకెండ్ లో సినిమాకి వచ్చిన స్పందన తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టింది.


మొత్తంమీద చూసుకుంటే దాదాపు 390 కోట్ల మేరకు కలెక్షన్లు ఈ సినిమా రాబట్టినట్లు తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పండగ సీజన్ అయిపోయిన క్రమంలో సినిమా నీ ప్రస్తుతం పట్టించుకునే వారే లేనట్టుగా 'సాహో' సినిమా విడుదలైన సినిమా హాల్ల పరిస్థితి చూస్తోంటే తెలుస్తోంది. ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాకి కొద్దో గొప్పో ఆదరణ ప్రస్తుతం లభిస్తుంది. మిగతా చోట్ల మొత్తం మాత్రం సినిమాకి పెద్దగా స్పందన రావటం లేదు. దీంతో 'సాహో' సినిమా మరెక్కడా కూడా గట్టెక్కే అవకాశాలు ఉన్నాయా వసూళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నలు వేస్తున్నారు.


మేకర్స్ ఏమో వసూళ్ల ఫిగర్స్ వేస్తున్నారు కానీ షేర్లు ఎక్కడా ఎందుకు వెయ్యడం లేదని మరికొంత మంది అడుగుతున్నారు. దీంతో ఈ ఫిగర్స్ చెప్పకుంటూ అభిమానులు అయితే ఆనందపడుతున్నారు కానీ సినిమాను కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారా లేదా అన్నది ఆలోచించలేకపోతున్నారు. మొత్తానికి 'సాహో' కలెక్షన్ల బట్టి ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా కొని చాలా నష్టపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. చాలా భారీగా సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: