టాలీవుడ్ లో బాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు..అందులో కొద్ది మందిమాత్రమే సక్సెస్ సాధించారు. చాలా మంది ఒకటీ రెండు సినిమాలతో బిషానా సర్ధేసుకున్నారు.  అప్పట్లో  తెలుగులో వచ్చిన ‘రణం’, ‘సామాన్యుడు’, ‘బెండు అప్పారావు’, ‘కత్తి కాంతారావు’, ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న హీరోయిన్ కామ్మా జఠ్మలానీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఈ రోజు కన్నుమూసిన ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ మనుమరాలు. 

తెలుగు లో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.  ఈ రోజు ప్రముఖ న్యాయవాది మ్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గా పనిచేశారు.   దేశంలోని పలు సంచలనం సృష్టించిన కేసులను రాంజెఠ్మలానీ వాదించారు. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా కేసుతో పాటు పీవీ నరసింహరావు కేసులను కూడ ఆయన వాదించారు. దేశంలో సెలబ్రెటీలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల కేసులు ఈయన డీల్ చేశారు. 

1923 సెప్టెంబర్ 14న సింధ్‌ ప్రావిన్సులోని సిఖర్పూర్‌లో  ఆయన జన్మించారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో కేసులు వాదించారు.2017లో ఆయన తన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పారు. రాంజెఠ్మలానీ కొడుకు కూతురు కూడ లాయర్లే. కొడుకు మహేష్ జెఠ్మలానీ  ప్రముఖ న్యాయవాది. రాజీవ్ గాంధీ హంతకుల కేసు, స్టాక్ మార్కెట్ కుంభకోణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్‌ల కేసు, అఫ్జల్ గురు ఉరిశిక్ష, జెస్సికా లాల్ మర్డర్ కేసులను ఆయన వాదించారు.  ఈ నేపథ్యంలో ఆయనకు సినీ రంగంతోనూ పరిచయాలున్నాయి. 

ఆ పరిచయాలతో తన మనవరాలికి సినీ రంగంపై ఆసక్తి ఉందన్న విషయం తెలుసుకొని ఆమెను ప్రోత్సహించారు.  మొదట మోడలింగ్ చేసిన కామ్మా జఠ్మలానీ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. 
కామ్నా జఠ్మలానీతండ్రి నిమేష్ జఠ్మలానీ బిజినెస్ మెన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్. కామ్నా జఠ్మలానీ 2014లో బెంగుళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్పాల్ ను వివాహం చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: