రన్ రాజా రన్ అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్, ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించాడు. హీరో శర్వానంద్ క్యారెక్టర్, కథ, కథనాలు, ఆసక్తికరమైన ట్విస్టులు వెరసి ఆ సినిమాకు మంచి విజయం దక్కేలా చేసాయి. అయితే అనూహ్యంగా రెండవ సినిమానే రెబల్ స్టార్ తో చేసే అద్భుత అవకాశం సుజీత్ కు రావడంతో, అందరూ కూడా వారిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక మధ్యలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు భాగాలూ రిలీజ్ అయి, దేశ విదేశాల్లో ప్రభాస్ కు ఎనలేని క్రేజ్ తీసుకురావడంతో, 

సాహో సినిమాను ఆయన రేంజికి తగ్గట్లుగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎన్నో ప్రయాశలతో షూటింగ్ పూర్తి చేసి, ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. అయితే మొదటి నుండి ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలున్న పెట్టుకున్న ప్రేక్షకుల ఆశలపై దర్శకుడు సుజిత్ చాలావరకు నీళ్లు చల్లారని చెప్పాలి. తొలిరోజు తొలిఆట నుండే సాహో నెగటివ్ టాక్ ని సంపాదించి మెల్లగా ముందుకు సాగింది. మధ్యలో కొందరు సినిమా బాగానే ఉందని చెప్పినప్పటికీ, మెల్లగా రోజులు గడిచేకొద్దీ సాహోకు కలెక్షన్స్ మాత్రం చాలవర్లకు తగ్గుముఖం పట్టసాగాయి. అయితే సాహో రిలీజ్ తరువాత ఇటీవల ఒక వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు సుజీత్, బహిరంగంగా మాత్రం మీడియా ముందుకు రాలేదు. అయితే షాకింగ్ గా ఆయన నేడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు కాసేపటినుండి టాలీవుడ్ వర్గాల్లో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే దానికి ఒక కారణం కూడా ఉందట, 

ఇటీవల సాహో షూటింగ్ తరువాత చాలా రోజుల పాటు నిర్విరామంగా సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీ బిజీగా తిరిగిన దర్శకుడు సుజీత్, గత కొద్దిరోజులుగా తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసారని, ఇక సాహో రిలీజ్ తరువాత కొద్దిపాటి జ్వరంతో మంచం పట్టిన ఆయనకు, ఇటీవల డెంగ్యూ ఫీవర్ అటాక్ అయినట్లు చెప్తున్నారు. అదీకాక సాహో ఫెయిల్యూర్ కూడా ఆయనను మానసికంగా కొంత కృంగదీసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫీవర్ కు ఇప్పటివరకు ఇంట్లోనే చికిత్స తీసుకున్న సుజీత్, అది పూర్తిగా నయం కాకపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు నేడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారట. అయితే సుజీత్ ఆరోగ్యం విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉందిని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: