ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ త్రీ చాల రసవత్తరంగా మారింది. ఎనిమిదవ వారం లో అడుగుపెట్టాబోతున్న క్రమం లో సండే జరగబోయే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున తో నాని వ్యవహరిస్తున్నారు. తాజా గా ఆదివారం జరగబోయే షో కి సంబంధించిన ప్రోమో వీడియో విడుదలైంది. దింతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.  రోజు రోజుకి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యుల క్యారెక్టర్లు బయటపడడం కొత్త గ్రూపులు ఏర్పడటంతో షో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నాని హీరోగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నారు.


ఈ సినిమా ఈ నెల పదమూడవ తారీఖున విడుదల కానుంది. ఇటువంటి నేపధ్యంలో ఈ సినిమాకి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలో భాగంగా నాని హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో ఈ వారం షో హైలైట్ గా మారింది. ఇక్కడ విశేషమేమిటంటే.. బిగ్ బాస్ సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' సినిమా రిలీజైంది. ఆ సమయంలో ప్రమోషన్స్ కోసం నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


అయితే ఇప్పుడు విచిత్రంగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రమంలో నాచురల్ స్టార్ నాని తన సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్ కోసం హౌస్ లో అడుగుపెట్టడం చాలా చిత్రంగా ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే షో లో ఈరోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఎలిమినేటి కి కావడానికి ప్రస్తుతం నలుగురు ఉన్నారు. శ్రీముఖి, మహేష్, రవి, అలీ రెజా. ఈ నలుగురిలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. అయితే బయటకు వచ్చిన వార్తల ప్రకారం హౌస్ నుండి అలీ రెజా ఎలిమినేట్ అవుతున్నట్లు కామెంట్ వినబడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: