టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచి మంచి పేరు సంపాదించింది. ఇక అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సమంతకు ఆఫర్లు కూడా బాగా వచ్చాయి. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె నటించిన బృందావనం, సూపర్ స్టార్ మహేష్ తో ఆమె నటించిన దూకుడు, ఆ తరువాత నాని, రాజమౌళి కలయికలో వచ్చిన ఈగ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు సమంత. ఇక ఆ తరువాత తెలుగు సహా తమిళంలోను ఆమెకు విపరీతంగా అవకాశాలు దక్కాయి. ఇక అప్పటినుండి సమంత రెండు సినిమా ఇండస్ట్రీల్లోనూ పలువురు స్టార్ హీరోల కలయికలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

ఇక అప్పటినుండి ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్న సమంత, ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల అక్కినేని వారబ్బాయి నాగచైతన్యను వివాహమాడిన సమంత, పెళ్లి తరువాత మాత్రం కాస్త సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వివాహం అనంతరం ఆమె నటించిన రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తన భర్త చైతన్య అన్ని విధాలుగా తనకు సహకారం అందిస్తారని, పెళ్లి తరువాత కూడా చైతన్య తనకు సినిమాల విషయమై పూర్తి స్వేచ్ఛనిచ్చారని అంటోంది. ఇక ఇటీవల తన కెరీర్ మరియు ఫ్యామిలీ విషయాలను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ ద్వారా పంచుకున్న సమంత, వరుసగా తనకు మంచి విజయాలు అందిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు సర్వదా రుణపడి ఉంటానని అన్నారు. 

ఇక తమ అత్తమామలైన నాగార్జున, అమల గార్లు, తనను సొంత కూతురు మాదిరిగా చూసుకుంటున్నారని, అయితే తనకు ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం లేదని, ఆ డెసిషన్ తమ భార్యాభర్తలు ఇద్దరం కలిసి తీసుకున్నాం అని చెప్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మీరు, మరే ఇతర శాఖలోనైనా పనిచేయాలని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ, భవిష్యత్తులో తనకు నిర్మాతగా మారి మంచి సినిమాలు నిర్మించాలని ఉందని అన్నారు. అయితే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వంటివి తన సంస్థ ద్వారా రూపొందించాలనే ఆలోచన తన మదిలో ఉందని, కానీ దానికి చాలానే సమయం పడుతుందని ఆమె తెలిపారు. సో దీన్నిబట్టి ఇప్పటివరకు సమంతను హీరోయిన్ గా చూసిన తెలుగు ప్రేక్షకులు, ఇక పై మంచి నిర్మాతగా కూడా చూడనున్నారన్నమాట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: