జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన నమిత ఆ తరువాత సొంతం,ఒక రాజు ఒక రాణి,ఒక రాధ ఇద్దరు కృష్ణులపెళ్లి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననల్ని పొందింది.తమిళ,కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మగా మారి వీరేంద్రచౌదరినిపెళ్లిచేసుకుంది.ఇక చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తరువాత తమ ఫిజిక్ మెయింటైన్ చెయ్యలేక సినిమాలకు,టాటా చెప్పేస్తారు.కానీ,నమిత మాత్రం డిఫరెంట్‌గా పెళ్లి తరువాత తన ఫిజిక్ ను మార్చుకుని పూర్తిస్థాయిలో నటిగా మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి రెడీ అవుతుంది.అందుకే నమిత హాట్ మాత్రమే కాదు గ్రేట్ అని అనుకుంటున్నారు..



ఇక సొంతం,జెమిని,సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నమిత ఆ తరువాత మాత్రం తెలుగులో పెద్దగా కనిపించలేదు.ఎక్కువగా తమిళ సినిమాలే చేసింది. దాంతో అక్కడ ఆమెకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.బొద్దుగా ఉన్న హీరోయిన్స్‌ని అమితంగా ఇష్టపడే తమిళ ప్రేక్షకులు ఆమె అందానికి,నటనకు ఫిదా అయ్యారు. ఒక వీరాభిమాని అయితే ఏకంగా ఆమెకి గుడి కట్టించాడు.ఇక వివాహం తర్వాత నమిత సినిమాలు తగ్గించింది.పెళ్లి తరువాత భర్తతో కలిసి మీడియాలో బాగానే సందడి చేసిన నమిత ఆ తరువాత మాత్రం పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం అయ్యింది.దాంతో చాలామంది హీరోయిన్స్‌లానే పెళ్లి తరువాత ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది అనుకున్నారు.



కానీ నమిత మాత్రం ఇప్పుడు తన కొత్త అవతారంతో అందరికి సాలిడ్ షాక్ ఇచ్చింది.ఒక్కసారిగా ఆమెని చూస్తే నమిత అని గుర్తు పట్టడం కూడా కష్టమే.బొద్దుగుమ్మలా ఉండే నమిత కాస్త ఇప్పుడు ముద్దు గుమ్మలా మారింది.జిమ్‌లో ఎంత టైం గడుపుతుందో,ఎన్ని గంటలు కష్టపడుతుందో తెలియదు కానీ సూపర్ స్లిమ్‌ లుక్‌లోకి వచ్చేసింది.వర్కౌట్స్ చేసి తగ్గడం వల్ల ఆమె ఫేస్‌లో గ్లో కూడా బావుంది.అందుకే ఆమె రీసెంట్ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఆ ఫోటోస్ చూసి ప్రేక్షకులే షాకవుతున్నారు.ఇక ఇప్పుడున్న ఆమె ఫిట్‌నెస్ చూసి ఫిల్మ్‌మేకర్స్ నుండి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి అనడంలో సందేహం లేదు.కాకపోతే ఆమె ఇప్పుడే సినిమాల్లో నటిస్తుందా,మరికొంతకాలం మ్యారీడ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేసాక వస్తుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.కాని త్వరలో మాత్రం ప్రేక్షకుల్ని అలరించడానికి మాత్రం సిద్దపడుతుందని అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: