తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 షో రోజు రోజు కీ మంచి పేరు వస్తుంది.   ఇప్పటికీ ఏడో వారం నడుస్తుంది. అయితే గతంలో బిగ్ బాస్ షో తో పోల్చుకుంటే ఈసారి బిగ్ బాస్ షో చాలా సాదా సీదాగా కూల్ కూల్ గా నడుస్తుంది.  బిగ్ బాస్ షో లో మొదటి వారం ఎలిమినేష్ లో నటి హేమ ఎలిమినేట్ అయ్యింది.  అదే సమయానికి వైల్డ్ కార్డు ఎంట్రీతో తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది.   ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ లో కి ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా బిగ్ బాస్ షో లో దుమ్మురేపింది. 

ముఖ్యంగా తమన్నా సింహాద్రి టివి నటుడు రవికృష్ణను టార్గెట్ చేసుకొని చేసి రచ్చ అంతాఇంతా కాదు.  మొత్తానికి తమన్నా మూడో వారం ఎలిమినేట్ అయ్యింది.  ఆమె తర్వాత టివి నటి రోహణి, అర్షు ఎలిమినేట్ అయ్యారు. గత వారం శని, ఆదివారాల్లో రమ్యకృష్ణ ఎంట్రటైన్ మెంట్ దుమ్మురేపింది.  ఈ వారం నాగార్జునతో మంచి జోరు కొనసాగుతుంది.  ముఖ్యంగా ఎలిమినేట్ చాలా టెన్షన్ వాతారవరణంలో నెలకొంది. అయితే ఈసారి ఎలిమిట్ తర్వాత వైల్డ్ కార్ట్ ఎంట్రీగా ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యారు. పెద్దగా ఫలితం లేదు. తమన్నా ఆల్రెడీ అవుట్, శిల్పా తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది కానీ ఇప్పటికి వరకూ సౌండ్ లేదు.

దాంతో నెక్ట్స్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదిరిపోవాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకోసం రకరకాల పేర్లను పరిశీలించింది. కానీ ఏది పెద్దగా కిక్ ఇవ్వటం లేదట. టీఆర్పీలు దుమ్ము రేపుతాయి. ఆయన ఆలోచనలు, విలువలు, చర్యలతో బిగ్ హౌస్ ఖచ్చితంగా షాక్ కు గురి అవుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే వర్మకు తెలిసినట్లుగా మరెవరికీ ఎలా ఎక్సపోజ్ అవ్వాలి..వివాదం మొదలెట్టాలి అనే విషయాలు తెలియవు. అయితే ట్విట్టర్, వోడ్కా లేకుండా ఓ వారం అయినా వర్మ ఉండగలరా అనేదే పెద్ద ప్రశ్న 


మరింత సమాచారం తెలుసుకోండి: