ప్రముఖ కోలీవుడ్ సీనియర్  డైరెక్టర్  మణిరత్నం చారిత్రక నేపథ్యం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నచిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. మణిరత్నం కలల ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న ఈచిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోవుంది. ఇక ఈచిత్రం కోసంప్రముఖ సీని గేయ రచయిత  వైరముత్తు ను తీసుకున్నారట.  ఇందులో12 పాటలకు ఆయన సాహిత్యం అందించనున్నారు. ఈవిషయాన్నిమణిరత్నం  అధికారకంగా ప్రకటించారు. అయితే  మణిరత్నం తీసుకున్న ఈ నిర్ణయం ఫై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో 'మీటూ' ఆరోపణలు ఎదుర్కున్న వైరముత్తును ఈ మెగా ప్రాజెక్ట్ కు ఎందుకు తీసుకున్నారని ప్రశిస్తున్నారు.  అతని తో కాకుండా వేరే రైటర్లతో  పాటలు రాయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.




ఇక ఫేమస్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్  చిన్మయి, వైరముత్తు ఫై మీటూ ఆరోపణలు చేసిన  విషయం తెలిసిందే.  తనను శారీరికంగావాడుకోవడానికి  గతంలో వైరముత్తు ప్రయత్నించాడని ఆరోపించింది. ఈ వివాదం అప్పట్లో  సంచలనం సృష్టించింది.  ఈనేపథ్యంలో చిన్మయి తో పాటు మరి కొంత మంది మహిళలు  కూడా వైరముత్తు వల్ల ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటపెట్టారు.  అయితే ఈ ఆరోపణలు కొంత మంది కోలీవుడ్ ప్రముఖులు కొట్టి పారేసి వైరముత్తు కు అండగా నిలిచారు.  


కాగా మణిరత్నం ఈ చిత్రం కోసం స్టార్ క్యాస్ట్ ను తీసుకుంటున్నాడు. అందులో భాగంగా చియాన్ విక్రమ్ ,విజయ్ సేతుపతి , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్,అనుష్క ,నయన తార , కీర్తి సురేష్ లను ముఖ్య పాత్రలకు ఎంపిక చేశారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మణిరత్నం.. సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఫై ఈ చిత్రాన్ని నిర్మించనుండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహెమాన్ సంగీతం అందించనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: