ఒకప్పడు రామ్ గోపాల్ వర్మ అంటే సెన్సేషన్. ఇప్పడు మాత్రం కేరాఫ్ కాంట్రవర్సీ. నిత్యం వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మకు పబ్లిసిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తాను ఏ సినిమా చేసినా ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడో సినిమా తెరకెక్కిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. అనే టైటిల్ తో సినిమా తీస్తూ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ బజ్ క్రియేట్ చేశాడు. దీనిపై ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో హీరో బాలకృష్ణ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

 


ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ “మీకిష్టమైన క్యాస్ట్ ఏంటి” అని అడిగిన ప్రశ్నకు వర్మ.. ‘నాకు కమ్మ సామాజికవర్గం అంటే ఇష్టం.. వాళ్లు చూపించే దర్పం నాకు ఇష్టం. దర్జాగా ఉంటారు. వీరమాచనేని.. చౌదరి.. అనే పేర్లు సినిమా టైటిల్స్ లా ఉంటాయి’ అన్నాడు. అయితే.. బాలకృష్ణతో సినిమా చేస్తారా.. అని మళ్లీ అడిగిన ప్రశ్నకు వర్మ.. “నో.. చేయను.. బాలకృష్ణ నాకు కమ్మ వ్యక్తిలా అనిపించడు.. నాకు విజయవాడ కమ్మ ప్రజలే ఇష్టం” అని అన్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం యాంకర్ వంతైంది. ఈ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడింది కాంట్రవర్సీ కాకపోయినా వినడానికి అలా అనిపిస్తుంది. వర్మ తీస్తున్న సినిమా కాన్సెప్ట్ లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే వర్మ జవాబిచ్చాడు.

 


ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా చర్చనీయాంశంగా మారింది. ఇందులో కాంట్రవర్సీ ఏమీ ఉండదని సమకాలీన రాజకీయాల్లోని వ్యక్తులే పాత్రలుగా ఉంటాయని ఇప్పటికే వర్మ ప్రకటించాడు. రీసెంట్ గా చంద్రబాబు పాత్రధారి పిక్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేపాడు. వచ్చే నవంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: