సినీ మహోత్సవం.. సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ.. ఇటు దర్శక నిర్మాతలకు, అటు నటీనటులకు చేదోడు వాదోడుగా ఉండే ప్రొడక్షన్ మేనేజర్స్.. తమ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకను ఈపేరుతో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 8న ‘సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం’ పేరుతో హైదరా బాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కన్నుల పండువగా జరిగింది. ప్రొడక్షన్ మేనేజర్లంతా కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుక విజయవంతంగా సాగింది.


ప్రోడక్షన్ మేనేజర్స్ కృషి సినీ ఇండస్ట్రీలో మరువలేనిది.. చెన్నై నుంచి హైదరాబాద్‌‌కి తరలివచ్చే సమయంలో ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రొడక్షన్ మేనేజర్స్ ఎంతో సహకరించారు. ఒక విధంగా చెప్పాలంటే.. మేనేజర్లు లేనిదే స్టార్లు లేరు. అందుకే వారంతా కలసి చేస్తున్న వేడుక విజయవంతంగా సాగింది. సినిమాను ముందుండి నడిపించే మేనేజర్లు చేస్తున్న ఈ ఈవెంట్ సక్సెస్ గా జరిగింది.


ఈ ఈవెంట్ లో కొన్ని స్వీట్ మూమెంట్స్ కనిపించాయి. సైరా గా త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. సినీ మహోత్సవం సందర్భంగా ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారి ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతోంది.


సినీపరిశ్రమలో మహేశ్ బాబు పెద్దగా కార్యక్రమాల్లో కనిపించరు. అలాగే చిరంజీవి కూడా.. అలాంటి వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం.. అందులోనూ ఆత్మీయంగా పలకరించుకోవడం ఈ ఇద్దరి ఫ్యాన్స్ కు ఈ ఫోటో కనువిందు చేస్తోంది.త్వరలో అటు మెగాస్టార్ మూవీ సైరా విడుదల కాబోతోంది. ఈ సినిమా తప్పనిసరిగా హిట్ కావాలని తెలుగు సినీప్రముఖులంతా కోరుకుంటున్నారు. ఇటీవల విడుదలైన సాహో కూడా బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబడుతూ సైరాకు మంతి ఉత్సాహాన్నిస్తోంది. సైరా సినిమా విజయం సాధించాలని మహేశ్ చిరంజీవితో చెబుతుంటే.. మీ సరిలేరు నీకెవ్వరు.. టైటిల్ కు తగ్గట్టు బంపర్ హిట్ కావాలని చిరంజీవి అంటున్నట్టుగా ఈ ఫోటో ఉంది కదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: