టాలీవుడ్ స్టార్ హీరోయిన్ , అక్కినేని వారి ఇంటి కోడలు , నాగచైతన్య భార్య సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది. ఆమె ఏ సినిమా చేసినా కూడా అది బంపర్ హిట్ అవుతూ సామ్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తూపోతున్నాయి. ఇక రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం రంగస్థలంలో ఆమె చేసిన రామలక్ష్మి పాత్ర ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది.  

ఈ ఏడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన మజిలీ, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబి కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా 96 రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. 

ఇక విషయానికొస్తే .... ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న సమంత ..తాజాగా శ్రద్ధా కపూర్‌ నటించిన చిచ్చోరే సినిమాపై కామెంట్‌ చేసింది. హిందీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  ప్రధాన పాత్రలో  నటించాడు. సాహో సినిమాలో ప్రభాస్ కు ఎలాంటి పాత్ర ఉన్నదో.. దానికి సమానమైన పాత్ర చేసింది హీరోయిన్ శ్రద్దా కపూర్. పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ భామ ఫైట్స్ కూడా అద్భుతంగా చేసింది.  ఈ  శుక్రవారం రోజున రిలీజైన ఈ మూవీ మంచి టాక్ తో ముందుసాగిపోతుంది. ఈ సినిమా  చూసిన వెంటనే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ఈ సినిమా గురించి కొన్ని సంచలన  వ్యాఖ్యలు చేసింది. సినిమా చూశానని, చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది. శ్రద్దా కపూర్ అద్భుతంగా నటించిందని , సినిమా అమేజింగ్‌గా ఉందని.. చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వానని తెలిపింది.ఇకపోతే ఈ మధ్య కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు వేడుకలని స్పెయిన్ లో చాలా ఘనంగా నిర్వహించారు. నాగ్ బర్త్ డే  వేడుకల్లో సామ్ ఒక రెంజ్ లో రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం ఆమె దృష్టిని మొత్తం 96 రీమేక్‌ పై పెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: