ఈటీవీలో టాప్  రేటింగ్ తో దూసుకుపోతున్న షో జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో. క్యాప్షన్ కు తగ్గట్లే షో కూడా ఖతర్నాక్ అని అందరూ అంటారు. తమ టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి అతి పెద్ద ఫ్లాట్ ఫామ్ ఈ  జబర్దస్త్..అయితే ఎందరికో అన్నం పెట్టింది ఈ షో. చాలా మంది ఇక్కడ టాలెంట్  నిరూపించుకొని వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు .

ఇకపోతే ఈ షో లో  లేడీ గెటప్లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా చూసుకుంటే వినోదిని అలియాస్ వినోద్ పేరు వింటూనే ఉంటాము..  చమ్మక్ చంద్ర టీంలో ఉన్న వినోద్ చంద్రతో పోటీ పడి మరి నటిస్తుంటాడు. ఈ మధ్య వినోద్ జబర్దస్త్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే..అయితే ఈతగాడిపై మొన్న ఆమధ్య దాడి జరింగింది దానితో కొంచం గ్యాప్ తీసుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే.. వినోదిని ఆడ కాదు మగ కాదు  ఒక ట్రాన్స్ జెండర్ అంటూ వార్తలు వచ్చాయి. దానికి స్పందించిన వినోద్ నేను మగాడిని లేడీ గెటప్ వేస్తె అదే అయిపోతారా కొంచం మనుసు పెట్టి ఆలోచించండి.నేను ఒక మగాడిని మీరు నమ్మిన నమ్మక పోయిన అది నిజం అని వినోద్  వెల్లడించారు. మరో విశమేంటంటే లేడీ గెటప్లో నే నాకు సినిమా అవకాశాలు  వస్తున్నాయి. దయచేసి మీరు ఏదేదో అనకండి మాకు మనసు ఉంటుంది. మేము మనుషులమే అంటూ వినోద్ అభ్యర్థించాడు. ఇంకొద్ది రోజుల్లో తిరిగి జబర్దస్త్ లో కనిపిస్తాను. మిమ్మల్ని నవ్వించడానికి నా వంతు పని నేను చేస్తాను. మీకు ఉన్న పిచ్చి ఆలోచనలతో నన్ను భాదపెట్టకండి. అని వినోద్ వెల్లడించారు.ఇదిలా ఉంటే.. వినోద్ జబర్దస్త్ కామెడీ షోలోనే కాకుండా కొన్ని ప్రైవేట్ ఈవెంట్‌లకు హాజరై కామెడీ షోలు నిర్వహిస్తున్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు వినోద్.


మరింత సమాచారం తెలుసుకోండి: