యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాహుబలి తర్వాత మళ్ళీ అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి.క్రియోషన్స్ నిర్మించిన సినిమా సాహో. దాదాపు రెండేళ్ళు ఈ సినిమాని తెరకెక్కించాడు సుజీత్. ముందు అనుకున్న బడ్జెట్ 50-60 కోట్లు మాత్రమే. కానీ బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు బడ్జెట్ పెంచుకుంటు పోయి 350 కోట్లకు చేర్చారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం..ఇలా దాదాపు ముఖ్యమైన అన్నీ భాషల్లో సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ముందు నుంచే సన్నాహాలు చేశారు చిత్ర బృందం. అందుకు తగ్గట్టే ప్రమోషనల్ ప్లాన్స్ కూడా బాగా చేశారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ లో ఎక్కువగా టార్గెట్ పెట్టుకున్నారు. 

అందుకే అటు ముంబాయ్, ఇటు హైదరాబాద్ లలో ఎక్కువగా ఫోకస్ చేసి సినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా చేశారు. ఎప్పుడెప్పుడు ఆగస్టు 30 వస్తుందా అని ప్రపంచ వ్యాప్తంగా అందరు కళ్ళు కాయలు కాచేలా టీజర్స్ ట్రైలర్స్ తో ఓ రేంజ్ క్రేజ్ ని తెచ్చారు. ఇక అనుకున్నట్టుగానే ఆగస్టు 30 న సాహోని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. ముందెన్నడు లేని విధంగా 10,000 స్క్రీన్ లలో అత్యంత భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ డివైడ్ టాక్ ని, యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. అంతేకాదు ప్రభాస్ ఫ్యాన్స్ ని దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దెబ్బతో రిజల్ట్ బాగా తేడా కొట్టేసింది. సరిగా నాలుగురోజులకే థియోటర్స్ లో జనాలు లేక వెల వెల బోయాయి. బడ్జెట్ భారీగా పెరగడంతో సుజిత్ సినిమాను హ్యాండిల్ చేయలేకపోయాడు. 

సినిమా మొత్తం లో కనీసం ఒక్క సీన్ కూడా సొంతంగా రాసుకున్నట్టు అనిపించలేదు. ప్రతీ సీన్ ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చినట్టు తెలిసిపోతోంది. ఇదిలా ఉంటే మొదటి వారానికే దాదాపు 40% థియోటర్స్ లో సాహోని ఎత్తిపడేశారు. ఇక మొన్నటిదాకా ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మేయిన్ రీజన్ దర్శకుడే అని అన్నారు. ఇప్పుడు హీరోయిన్ మీద పడ్డారు. శ్రద్ద కపూర్ ఐరెన్ లెగ్ కాబట్టే సాహో సినిమా పోయిందని కొత్త టాక్ ఒకటి మొదలైంది. పాపం శ్రద్ద ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలతో హిట్ కొట్టినప్పటికి తెలుగులో చేసిన డెబ్యూ సాహో మాత్రం ఫ్లాపయింది. అందుకే ఇప్పుడు శ్రద్ద మీద పడుతున్నారు. ఏమాటకామట చెప్పాలి గాని కథలో దమ్ము లేనప్పుడు హీరోయిన్ ఎవరైనా సినిమా ఫ్లాప్ అవక బ్లాక్ బస్టర్  అవుతుందా మరీ విడ్డూరం కాకపోతేను. 


మరింత సమాచారం తెలుసుకోండి: