యూత్ ఐకాన్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మాంచి ఫాం లో ఉండగానే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ కి మంచి మార్కులే పడ్డాయి. అటు తమ్ముడిని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే తను మరో బాధ్యతను తీసుకున్నాడు. అందరు హీరోల మాదిరిగానే నిర్మాతగా మారాడు విజయ్ దేవరకొండ. కొత్త దర్శకుడితో ఓ ఫన్ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని తనకు పెళ్ళి చూపులు సినిమాతో లైఫ్ ఇచ్చిన డైరక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా చేస్తు 'మీకు మాత్రమే చెప్తా' అనే చిన్న సినిమాను సైలెంట్‌గా నిర్మించాడు. ఇప్పుడు ఆ సినిమాను విడుదలకు ముందే అమ్మేసి మంచి లాభం చేసుకున్నాడు. 

నిజంగా విజయ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎంత పక్కాగా ప్లాన్ లేకపోతే సినిమా రిలీజ్ కు ముందే లాభం చేసుకుంటాడు. ఈ సినిమాను నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, రెండున్నర కోట్లుకు తీసుకున్నారని లేటెస్ట్ న్యూస్. అయితే ఈ సినిమా నిర్మించడానికి ఖర్చు అయింది కూడా అక్షరాలా రెండున్నర కోట్లు అని సమాచారం. సునీల్ నారంగ్ టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు తీసుకున్నారు. ఇక నాన్ థియేటర్ హక్కులు విజయ్ దేవరకొండ దగ్గర వున్నాయి. అవి మొత్తం లాభంగానే మిగిలిపోతాయి. 
ఎంత లేదన్నా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ కలిపి 5-6 కోట్ల వరకు వస్తాయని తెలుస్తోంది. అందులో పబ్లిసిటీకి కాస్త పోయినా, మంచి లాభాలే వచ్చే అవకాశం వుంది.

వాస్తవానికి ఇంకెవరైనా తీసి వుంటే సునీల్ నారంగ్ ఇలా తీసుకునేవారో లేదో కానీ, విజయ్ దేవరకొండ కాబట్టి, అతనితో ఓ ప్రాజెక్టు కూడా చేసే అగ్రిమెంట్ వుంది కాబట్టి తీసుకున్నారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. చిన్న అమౌంట్ కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ వచ్చేస్తాయి. రాకపోయినా పెద్దగా నష్ఠం అయితే ఉండదని ఇన్‌సైడ్ టాక్. మొత్తానికి హీరోగానే కాదు నిర్మాతగాను బాగానే సక్సస్ అవుతున్నాడు. ఇక రాను రాను తన సొంత బ్యానర్ మీదే సినిమాలు నిర్మిస్తు.. నటిస్తాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఈ లెక్కన విజయ్ ప్రొడ్యూసర్స్ కోసం వేయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: