బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణి కపూర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన "శుద్ద్ దేశి రొమాన్స్ సినిమా" ద్వారా  హిందీ  తెరకు పరిచయం అయ్యింది . ఆమె కెరియర్ మొదలుపెట్టి 6 సంవత్సరాలు అవుతున్న చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో లేవు.. వాణి కపూర్ కు అందం మరియు అభినయం రెండు ఉన్నాయి. కానీ రవ్వంత అదృష్టం లేదు. ఈ భామ అందల అరబోతకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు.


ప్రస్తుతం  హీరో హృతిక్ రోషన్ మరియు  టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా నటిస్తున్న వార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా యాష్ రాజ్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.వార్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. ఈ సినిమా కోసం హృతిక్ మరియు టైగర్ లు  అత్యంత ప్రమాదకరమైన ఫైట్ సీక్వెన్స్ లు చేశారు.ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర టీజర్ మరియు ట్రైలర్ లకు విపరీతమైన ఆధారణ లభించింది.ఈ సినిమా ట్రైలర్  లో వాణి కపూర్  బికినిలో కనబడి అందరికి పిచ్చెక్కిస్తుంది . 


  ఈ సినిమాలో హృతిక్ రోషన్ కు జోడిగా నటిస్తుంది.వీరిద్దరి మధ్య షూట్ చేసిన "ఘుంగ్రూ" పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.ఈ పాట కోసం వాణి కపూర్ దాదాపు మూడు నెలలు కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిందంట. ఈ పాటలో ఆమె  పోల్ డ్యాన్స్ మరియు సైర్ వీల్ డ్యాన్స్  చేసింది. గాలిలో తిరుగుతున్న పోల్ పైన ప్రమాదకరమైన డ్యాన్స్ స్టెప్స్ చేసింది. అల చేయడం వల్ల ఆమె కు చాలా సార్లు దెబ్బలు తగిలాయి. డుప్ ను వాడకుండ ఆమె సాంగ్ ను పూర్తి చేసింది.ఆమె పట్టుదలను చూసి చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. హృతిక్ రోషన్ పక్కన డ్యాన్స్ చేయలంటే ఆ మాత్రం కష్టపడలని ఆమె చెబుతోంది. వార్ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 2న విడుదల అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: