మెగా అభిమానులు ‘సైరా’ విడుదల కోసం అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఇప్పటికే ఎడిటింగ్ స్టేజ్ లో రెడీ అయిన ఈ మూవీ ఫస్ట్ కాపీని చూసినవారు కొన్ని లీకులు ఇస్తున్నట్లు టాక్. ఈ సినిమా ప్రారంభం ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో అనుష్కతో ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది. 

ఆమె నోటి వెంట ‘సైరా’ కథ చెప్పడంతో ఈ మూవీ మొదలవుతుంది. ఈ మూవీలో వచ్చే సైరా నరసింహా రెడ్డి అనే టైటిల్ సాంగ్ ఐదు నిముషాలు పైగా ఉంటూ ఈ మూవీని చూసే ప్రేక్షకులను ప్రధమ స్వాతంత్ర ఉద్యమ కాలంనాటి పరిస్థితుల్లోకి తీసుకు వెళ్ళిపోతుందని టాక్. 

ఇక ఈ మూవీలో వచ్చే అండర్ వాటర్ ఫైట్ ఈ మూవీకి హైలెట్ గా మారుతుందని అంటున్నారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో భారీ ఫైట్స్ ఉండకుండా ఎక్కువగా ఎమోషనల్ డైలాగ్స్ తో నడుస్తుందని అయితే ఈ మూవీ ప్రీ క్లైమాక్స్ లో అత్యంత భారీ ఫైట్స్ ఉండేలా ఈ మూవీలోని సీన్స్ ను డిజైన్ చేసినట్లు సమాచారం.

ఈ మూవీ క్లైమాక్స్ లో ఉద్వేగభరితంగా చిరంజీవి నోటివెంట వచ్చే డైలాగ్స్ కు ప్రేక్షకులు చప్పట్లతో ధియేటర్లను హోరెత్తించడం ఖాయం అని అంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నరసింహా రెడ్డి జమిందారీ జీవితం విలాసాలతో నడుస్తుందని సెకండ్ హాఫ్ లో మాత్రమే నరసింహా రెడ్డి బ్రిటీష్ వారి పై చేసే తిరుగుబాటు సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో వచ్చే ఒక జాతర పాట ఈ మూవీను చూసే మాస్ ప్రేక్షకులు ఈలలు వేసే స్థాయిలో ఉంటుందని టాక్. ఇలా ఎలా చూసుకున్నా ఈ మూవీలో ప్రతి సన్నివేశం క్లాస్ మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా డిజైన్ చేయబడటంతో ఈ మూవీ సంవత్సరం విడుదలయ్యే సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: