కొంతమంది అమ్మాయిల వెంట ఎంతపడిన ప్రేమకు అంగీకరించరు,మరికొంతమంది చూడగానే తమ ప్రేమ అంగీకారాన్ని తెలుపుతారు.ఈ సంఘర్షణ వయస్సులో వున్న అమ్మాయిలకైతే ఏంటి,అబ్బాయిలకైతే ఏంటి.అందరికి ఒక్కటే.ఇక ప్రేమలేఖ నీకో నాకో రాస్తే అది మనమధ్యనే వుంటుంది.అదే సెలబ్రెటికి,మరో సెలబ్రెటీ రాస్తే అది అందరికి తెలిసిపోతుంది.సెన్సేషన్ అవుతుంది.అదే ఇప్పుడు జరిగింది.యూత్‌లో పిచ్చ పిచ్చ ఫాలోయింగ్ వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎప్పటినుంచో మనసు పారేసుకుని ఎదురుచూస్తున్న ఓ నటి వుంది.ఇప్పుడామే తన మనసులోని భావాలను బయటకు తీసి ప్రేమలేఖ రాసింది.



హీరోయిన్ మాధవీలత పవన్ కళ్యాణ్ కోసం గతంలో మౌనదీక్షలను కూడా చేసింది.ఎందుకంటే ఈ గబ్బర్‌సింగ్ అంటే చాలా ఇష్టం.పవన్ కళ్యాణ్ పై వున్న ప్రేమను, ఇష్టాన్ని ఎన్నోసార్లు ఆమె స్వయంగా ప్రకటించింది.అయితే పవన్ పై ఉన్న్న ప్రేమ ఇప్పటిది కాదట ఆ ప్తేమ మనసుల్లో ఎప్పటికి అలానే వుంటుందని చెబుతూ,లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కోసం తను 2000 సంవత్సరంలో రాసిన ప్రేమ లేఖను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 2000వ సంవత్సరం జూన్ 6వ తేదీన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ ప్రేమకవిత రాసుకున్న మాధవీలత ఫేస్ బుక్‌లో కూడా పోస్ట్ చేసింది..తవేదన ఏంటో చూద్దాం..



‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన
నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన
ఒకపక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,.... కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను.
దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?
ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No.కానే కాదు.అటువంటిది కాదు.మరేంటి?.....


అంటూ తన హృదయంలో సాగే ప్రేమ ప్రవాహాన్ని అక్షరరూపంలో ఒడిసి పట్టుకుని అభిమానులతో పంచుకుంది.ఈ ప్రేమ కవిత ఎప్పుడో 19 ఏళ్ల క్రితం మాధవీలత రాసుకున్నదట.ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఇది చదివిన వారు పవన్‌ను పూర్తిగా అల్లేసిన లత ఏంటిబాబోయ్ ఈమె ప్రేమ సొద అని అనుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: