చంద్రయాన్ 2 ప్రయోగంతో ఇస్రో గురించి ఇస్రో చైర్మన్ గురించి ఇండియా ప్రజలందరికి తెలిసిపోయింది.  ఇస్రో చైర్మన్ గా శివన్ ఈ ఖ్యాతి సొంతం చేసుకున్నారు.  గతంలో ఇస్రోకు చైర్మన్ గా పనిచేసిన చాలామందికి చైర్మన్ గురించి తెలియదు.  పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వ్యక్తులకు మాత్రమే ఈ విషయం గురించి తెలుసు.  కానీ, ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరు అంటే లుంగీ కట్టుకొని పొలం పనులు చేసుకునే వ్యక్తికీ కూడా తెలిసిపోయింది.  శివన్ కదా ఇస్రో చైర్మన్ అని.  


మోడీ ఆలింగనంతో దేశం మొత్తం ఆయన్ను గుర్తించింది.  స్పేస్ సైన్స్ లో అపారమైన అనుభవం ఉన్న మేధావి ఆయన. బక్కపలచగా ఉండి.. మధ్యతరగతి ఉద్యోగిగా కనిపించే శివన్.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన వ్యక్తి. అయన గురించి మన దర్శక నిర్మాతలకు తెలిస్తే తప్పకుండా సినిమా తీసేస్తారు. ఒక సినిమా బయోపిక్ కు కావలసిన సబ్జెట్ అంతా అయన జీవితంలో ఉన్నది.  


వాళ్ళది శివన్ తండ్రి ఓ రైతు.  పొలం పండితేనేగాని సంవత్సరం గడవదు.  అందుకే నిత్యం అయన పొలంలోనే ఉండేవాడు.  శివన్ చిన్నతనంలో స్కూల్ కు వెళ్లి తిరిగి ఇంటికి రాగానే పొలం పనులకు వెళ్లి తండ్రికి సహాయం చేసేవాడు. డిగ్రీ చదువుకునే వరకు కూడా ఒక దోతీ కట్టుకొని కాలేజీకి వెళ్లేవాడట. కాళ్లకు చెప్పుకు కూడా ఉండేవి కాదట.  తనకు చదువు చెప్పించడానికి తండ్రి పడిన కష్టం అంతాఇంతా కాదని శివన్ చెప్పుకొచ్చాడు.  


ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ లో చేరుతాను అంటే తండ్రి తనకు స్తొమత లేదని, డిగ్రీలో చేరమని చెప్పాడు.  ఆ కాలేజీ కూడా తన ఊరికి దగ్గరగా ఉండేది.  కాలేజీ పూర్తికాగానే ఇంటికి రావడం, పొలంలో పనులు చేయడం వంటివి చేసేవాడట.  అయితే, తల్లిదండ్రులు ఎంత కష్టపడినా తనకు మాత్రం మూడు పూటలా  భోజనం పెట్టేవారని, తనకు ఆ లోటు లేకుండా చూసుకున్నారని అన్నాడు.  డిగ్రీ తరువాత ఇంజనీరింగ్ లో చేరేందుకు పొలం అమ్మి చేర్పించారని, ఎంజీరింగ్ తరువాత తనకు పిఎస్ఎల్వి లో ఉద్యోగం వచ్చిందని తాను కోరుకుంది ఒకటైతే మరొక దాంట్లో ఉద్యోగం వచ్చిందని కానీ నిరాశ చెందకుండా.. కష్టపడి పనిచేసి అంచలంచెలుగా ఎదిగినట్టు శివన్ పేర్కొన్నారు.  ఒక సాధారణ ఉద్యోగి నుంచి ఇస్రో చైర్మన్ గా ఎదిగిన తీరు అమోఘం.  అయన చరిత్రను సినిమాగా తీస్తే తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది.  జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: