ఈవారం విడుదల కాబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ మూవీని ప్రమోట్ చేస్తూ నాని అనేక పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా నిన్న ‘బిగ్ బాస్ 3’ హౌస్ లోకి వచ్చి సందడి చేసాడు. నిన్న ఒక ప్రముఖ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాని తన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ గురించి అనేక విషయాలు షేర్ చేస్తూ మధ్యలో బుల్లితెర కార్యక్రమాల హోస్టింగ్ విషయమై తన మనసులో మాటను బయటపెట్టాడు. 

రానున్న రోజులలో తనకు అవకాశం వస్తే బుల్లితెర పై ‘సత్యమేవ జయతే’ తరహాలో అందరికీ ఉపయోగపడే ఒక షో చేయాలనీ ఆలోచన ఉందని అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ ను టైమ్స్ పత్రిక గుర్తించడానికి గల కారణం అతడు హిందీలో నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ షో.

అట్టడుగు వర్గాల సామాజిక సమస్యలు అందరికీ తెలియ చెప్పడానికి అమీర్ ఖాన్ తన స్టార్ స్టేటస్ పక్కకు పెట్టి చేసిన ఈ షో అతడికి ఎంతో పేరు తెచ్చి పెట్టింది. వాస్తవానికి ఇలాంటి షోను ఒక ప్రముఖ ఛానల్ పవన్ కళ్యాణ్ తో చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసి పవన్ కు భారీగా ఆఫర్ చేసింది. 

అయితే పవన్ ‘సత్యమేవ జయతే’ తరహా కార్యక్రమం తెలుగు బుల్లితెర పై చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అలాంటి సామాజిక స్పృహ ఉన్న షో పై నాని ఆలోచనలు ఉండటంతో రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ చేయడానికి ఆసక్తి కనపరచని షోను తాను చేసి మరో కొత్త రికార్డును సృష్టిస్తాడేమో చూడాలి. నాని ప్రయత్నం సఫలం అయితే తెలుగు బుల్లితెర పై మరో అమీర్ ఖాన్ లా నాని మారబోతున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: