ఈ మద్య హీరోయిన్లు తమ నటన కన్నా అందాల ఆరబోతతోనే అభిమానులను సంపాదించుకుంటున్నారు.  అందం, అభినయం ఉన్న నటీమణులు అరుదుగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు అలా ఉంటేనే ప్రేక్షకులు బాగా రీసివ్ చేసుకుంటున్నాన్న అభిప్రాయం అన్ని సినీ పరిశ్రమల్లో మెంటల్ గా ఫిక్స్ అయ్యారు.  అందుకే కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోతుంది.  ‘అంబులి’ మూవీ ద్వారా కోలీవుడ్‌లోకి నటి సనంశెట్టి అడుగుపెట్టింది.

సవారి, వెల్లయా ఇరుక్కరవన్‌ పొయ్‌ సొల్లమాట్టాన్‌, గతం గతం వంటి పలు తమిళ మూవీస్ తో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. మిస్ సౌత్ ఇండియా 2016 గెలిచిన ఆ బ్యూటీ తర్వాత మోడలింగ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది.   ప్రస్తుతం రెండు తమిళ, ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాలు మరికొన్ని వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.  ఈ మద్య కొంత మంది హీరోయిన్లు సినిమాల్లో కన్నా వెబ్ సీరీస్ పైనే ఎక్కువ మోజు చూపిస్తున్నారు.

బాలీవుడ్ లో రాధికా ఆప్టే ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  హీరోలు సైతం ఇప్పుడు వెబ్ సీరీస్ పై దృష్టిపెడుతున్నారు.  సినిమాకు, వీటికి పెద్ద వ్యత్యాసం లేదు. రెండింటిలోనూ ఒకే రకమైన పారితోషకం, గౌరవం దక్కుతోంది. సినీ పరిశ్రమ రోజురోజుకూ మారుతోంది.  కేవలం సినిమాల్లో నటిస్తేనే గొప్ప పేరు వస్తుందనని భావిస్తే చాలా కష్టం..టాలెంట్ చూపించుకోవడానికి ఏ వేధిక అయినా పర్వాలేదు అంటుంది ఈ హాట్ బ్యూటీ. 

సినిమాలకు సెన్సార్‌ ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్లామర్‌గా నటించలేం. వెబ్‌ దారావాహికలకు సెన్సార్‌ లేనందువల్ల ఎక్కువ పాళ్లు అందాలు ఆరబోయవచ్ఛు అయినా అందాలు ఆరబోస్తే తప్పేంటి. కథలో సన్నివేశాలకు తగ్గట్లు బోల్డ్ పాత్రల్లో నటించాల్సి వస్తే తప్పకుండా నటిస్తానంటుంది సనం శెట్టి. 


మరింత సమాచారం తెలుసుకోండి: